English | Telugu

బాలయ్య న్యూ ట్రెండ్.. త్రీడీ సెట్ లో 'లయన్' ఆడియో

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లయన్'. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ‘లయన్' ఆడియోను ఏప్రిల్ 9న పలువురు సినీ మరియు రాజకీయ ప్రముఖుల సమక్షంలో అత్యంత భారీ స్థాయిలో విడుదల చేసేందుకు చిత్ర నిర్మాత రుద్రపాటి రమణారావు సన్నాహాలు చేసుకుంటున్నారు. అలాగే ఈ సినిమా ఆడియో కోసం ప్రత్యేకంగా మొదటిసారి త్రీడీ సెట్‌ను వేయిస్తున్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్య సీబీఐ ఆఫీసర్‌గాను, సామాన్యుడిగాను ద్విపాత్రాభినయం చేస్తున్నారు. బాలయ్య సరసన త్రిష, రాధికాఆఫ్టే హీరోయిన్లుగా నటిస్తున్నారు.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.