English | Telugu

నందమూరి బాల‌కృష్ణ‌, ఎన్టీఆర్ వార్నింగ్‌తో దారికొచ్చిన విశ్వక్‌సేన్!

విభిన్న కథాంశాలతో సినిమాలు చేస్తూ యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో విశ్వక్‌సేన్. తన కెరీర్‌లో ఫలక్‌నుమ దాస్, దాస్‌కి ధమ్కీ, హిట్, గామీ వంటి సినిమాలు చేసి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. తను చేసే ప్రతి సినిమా డిఫరెంట్‌గా ఉండాలని భావించే విశ్వక్.. గత ఏడాది లైలా సినిమాతో వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఎందుకంటే ఆ సినిమాలో అమ్మాయి గెటప్‌తో ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చెయ్యాలనుకున్నాడు. కానీ, ప్రేక్షకులు ఆ సినిమాను తిప్పికొట్టారు. ఫలితంగా డిజాస్టర్ అనిపించుకుంది.

లైలా ఇచ్చిన అనుభవంతో మరోసారి తనదైన ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించేందుకు ‘ఫంకీ’ చిత్రంతో రాబోతున్నాడు విశ్వక్. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మరో మంచి ఎంటర్‌టైనర్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌తో ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 13న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌లో ఒక విషయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు విశ్వక్‌సేన్.

లైలా చిత్రంలో విశ్వక్ లేడీ గెటప్ వేసిన విషయం తెలిసిందే. ఇది ప్రేక్షకులకే కాదు, నందమూరి బాల‌కృష్ణ‌, ఎన్టీఆర్‌లకు కూడా నచ్చలేదట. అందుకే ప్రేక్షకులు ఆ సినిమాని రిజెక్ట్ చేశారు. అయితే బాల‌కృష్ణ‌, ఎన్టీఆర్ మాత్రం విశ్వక్‌ని పిలిచి ‘ఇలాంటి ప్రయోగాలు ఎప్ప్పుడూ చెయ్యకు’ అని గట్టి వార్నింగ్ ఇచ్చారట. తనకున్న మాస్ ఇమేజ్‌కి భిన్నంగా వెళ్ళడం బాల‌కృష్ణ‌కు, ఎన్టీఆర్‌కు నచ్చలేదని, తనకు సూట్ అయ్యే సినిమాలే చెయ్యమని సలహా ఇచ్చారని ‘ఫంకీ’ ప్రమోషన్స్‌లో విశ్వక్ వెల్లడించారు.