English | Telugu

బాహుబలి ట్వీట్ రివ్యూ

మరికొద్ది గంటల్లో రిలీజ్ కాబోతోంది ‘బాహుబలి’ మూవీ. కేవలం భారతీయ సినీ ప్రేక్షకులేకాదు, యావత్తు ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రమిది. ఈ చిత్రంలో ప్రధానపాత్రల్లో నటించిన రానా, ప్రభాస్ పాత్రల విషయమై ఎవరి పెర్ఫార్మెన్స్ ఎలా వుంటుందోనని, ఎవరు ఎక్కువగా ప్రేక్షకుల్ని తమ ప్రతిభతో ఆకట్టుకుంటారోనని చర్చించుకుంటున్నారు. ఈ సినిమా ఫస్ట్ షో లైవ్ అప్ డేట్స్ మీ కోసం తీసుకువచ్చింది తెలుగువన్.

'బాహుబలి' సూపర్ గ్రాఫిక్ టైటిల్స్ తో మొదలైంది.

రమ్యకృష్ణ పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చింది.

అద్భుతమైన వాటర్ ఫాల్స్ మధ్య సిక్స్ ప్యాక్ బాడీతో ప్రభాస్ ఎంట్రీ ఇచ్చాడు. అతని పేరు శివుడు.

టైం ఫర్ ది ఫస్ట్ సాంగ్....ఎవ్వడంట ఎవడంట

మిల్కీ వాటర్ ఫాల్స్ మధ్య మిల్కీ బ్యూటీ ఎంట్రీ ఇచ్చింది. అవంతికగా తమన్నా ధీవరా పాట మొదలైంది.

విజువల్స్ స్టన్నింగ్‌గా ఉన్నాయి.

తమన్నా యాక్షన్ సీన్స్ సూపర్బ్ గా డిజైన్ చేశారు.

మాహిష్మతి అద్భుతంగా వుంది. టాలీవుడ్ హంక్ రానా ఎంట్రీ.. బుల్‌ఫైట్ కళ్ళు చెదిరిపోయేలా ఉంది.

రానా సామ్రాజ్యంలో బానిసగా అనుష్క దేవసేన గా ఎంట్రీ ఇచ్చింది.

తమన్నా, ప్రభాస్‌ల మధ్య లవ్ ట్రాక్ నడుస్తోంది.

బాహుబలి సూపర్ హిట్ సాంగ్ పచ్చబొట్టేసిన స్టార్ట్ అయ్యింది.

కథలో చిన్న ట్విస్ట్..మంచు తుఫాన్ లో ఫైట్స్ నడుస్తున్నాయి. సినిమా యాక్షన్ మోడ్ లోకి వస్తోంది.

ఎమోషనల్ సీన్స్ సినిమాని సూపర్‌గా నడిపిస్తున్నాయి. రాజమౌళి స్క్రీన్ ప్లే సూపర్బ్

ఇంటర్వెల్ బ్రేక్

సినిమా తిరిగి ప్రారంభమైంది. సీరియస్ మోడ్‌లో నడుస్తోంది.

రాజమౌళి మార్క్ చేజింగ్ సీన్స్ వస్తున్నాయి. ఓ అద్భుతమైన ఎమోషనల్ సీన్ ..రాజమౌళి స్క్రీన్ ప్లే సూపర్బ్

సినిమా ఫ్లాష్‌బ్యాక్ వెళ్ళిపోయింది. రమ్యకృష్ణ మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది.

రానా, ప్రభాస్‌ల మధ్య ఇంట్రెస్టింగ్ సీన్స్..జక్కన్న ఎంట్రీ ధియేటర్ గోల గోల

నోరా ఫతేహి, స్కార్లెట్ విల్సన్‌లు ఐటం సాంగ్‌

రాజ్యంలో పోలిటికల్ గేమ్స్ ..టైం ఫర్ ది బాహుబలి వార్ సీన్స్

యుద్ధం సన్నివేశాలు సినిమాకే హైలైట్

రాజమౌళి హాలీవుడ్ మార్క్ చూపిస్తున్నాడు.

ప్రభాస్ ఎమోషనల్ స్పీచ్ ..యుద్ధం దాదాపుగా ముగిసిపోయింది.

చిన్న ట్విస్ట్ ఫ్లాష్‌బ్యాక్ మోడ్ నుండి సినిమా మళ్ళీ ప్రెజెంట్ మోడ్‌లోకి వచ్చింది.

సినిమా ముగిసింది..బాహుబలి 2.. 2016లో రిలీజ్..!!

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.