English | Telugu

హ‌మ్మ‌య్య‌.. బాహుబ‌లి పూర్త‌యింది!

ఎట్ట‌కేల‌కు బాహుబ‌లి సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. రెండున్న‌ర సంవ‌త్స‌రాలుగా ఈ సినిమాని ఓ య‌జ్ఞంలా భావించి తెర‌కెక్కిస్తున్న రాజ‌మౌళి కృషి ఫ‌లించింది. బాహుబ‌లికి మంగ‌ళ‌వారం గుమ్మ‌డికాయ్ కొట్టేశారు. ప్ర‌భాస్‌, త‌మ‌న్నాల‌పై తెర‌కెక్కించిన పాట‌లో ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. అయితే... ఇప్ప‌టికి ఫినిష్ అయ్యింది తొలి భాగం మాత్ర‌మే. రెండో భాగంలో మ‌రో 30 శాతం చిత్రీక‌ర‌ణ మిగిలిఉన్న‌ట్టు స‌మాచార‌మ్‌. బాహుబ‌లి 1 విడుద‌లైన త‌ర‌వాత పార్ట్ 2 చిత్రీక‌ర‌ణ ప్రారంభిస్తారు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ సినిమాపై రూ.130 కోట్లు ఖ‌ర్చు పెట్టిన‌ట్టు టాక్‌. పార్ట్ 2లో మిగిలిన షూటింగ్ పూర్తిచేయ‌డానికి మ‌రో రూ.20 కోట్ల‌యినా కావాలి. అంటే బాహుబ‌లి మొత్తం బ‌డ్జెట్ 150 కోట్ల‌న్న‌మాట‌. మే 23న బాహుబ‌లి విడుద‌ల కావ‌ల్సివుంది. అయితే... ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిలో మేనాటికి ఈ సినిమా వ‌చ్చే అవ‌కాశాల్లేవు. జూన్ చివ‌రి వారంలోగానీ జులైలో గానీ బాహుబ‌లిని విడుద‌ల చేయ‌వ‌చ్చు.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.