Read more!

English | Telugu

వాటర్ బాటిల్ పై బద్రీనాథ్

వాటర్ బాటిల్ పై "బద్రీనాథ్" కనపడనున్నాడట. వివరాల్లోకి వెళితే అసలే ఎండా కాలం...దాహం తీర్చుకోవటానికి అందరూ మినరల్ వాటర్ బాటిల్స్ ఎక్కువగా కొంటూంటారు. కాబట్టి ఆ మినరల్ వాటర్‍ బాటిల్‍ పైన తమ సినిమా తాలూకు పేరుని ముద్రిస్తే తమ సినిమాకు బాగా ప్రచారం లభిస్తుందన్న ఆలోచన మెగా నిర్మాత అల్లు అరవింద్ గారికొచ్చింది.

గీతా ఆర్ట్స్ పతాకంపై, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, డైనమిక్ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో, అల్లు అరవింద్ నిర్మిస్తున్న విభిన్నచిత్రం "బద్రీనాథ్". "బద్రీనాథ్" సినిమాకి యమ్.యమ్.కీరవాణి సంగీతాన్ని అందించారు. ఆ మధ్య విడుదలైన "బద్రీనాథ్" సినిమా ఆడియోకి ప్రేక్షకుల నుండి మంచి స్పందల లభిస్తూంది. ఈ చిత్రం పబ్లిసిటీని చాలా విభిన్నంగా ప్లాన్ చేస్తున్నారు నిర్మాత అల్లు అరవింద్. వాటర్ బాటల్స్ పైన "బద్రీనాథ్" లోగోని ముద్రించి, తద్వారా "బద్రీనాథ్" సినిమాకి వెరైటీగా పబ్లిసిటీని చేస్తున్నారాయన.