English | Telugu

"ఆటోనగర్ సూర్య"కి అత్యంతఖరీదైన సెట్

"ఆటోనగర్ సూర్య"కి అత్యంతఖరీదైన సెట్ వేస్తున్నారు. వివరాల్లోకి వెళితే ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై, డాక్టర్ వెంకట్ సమర్పణలో, యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా, అందాల సమంత హీరోయిన్ గా, దేవకట్టా దర్శకత్వంలో, కె.అచ్చిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం "ఆటోనగర్ సూర్య". ఈ "ఆటోనగర్ సూర్య" చిత్ర దర్శకుడు దేవ కట్టా గతంలో వెన్నెల, ప్రస్థానం వంటి విభిన్నమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ఆయనకిది మూడవ చిత్రం. ఈ "ఆటోనగర్ సూర్య" చిత్రం కోసం నానక్ రామ్ గూడాలోకల రామానాయుడు సినీ విలేజ్‍ లో రెండు కోట్ల భారీ వ్యయంతో అత్యంత ఖరీదైన సెట్ ను వేస్తున్నారు.

ప్రస్తుతం మంచు లక్ష్మీప్రసన్న నిర్మిస్తున్న "ఊకొడతారా...ఉలోక్కిపడతారా" చిత్రం తర్వాత అత్యంత ఖరీదైన సెట్ ఇదే. నాగచైతన్య గత రెండు చిత్రాలు "దడ, బెజవాడ" ఘోరమైన ఫ్లాపులుగా నిలిచాయి. ఈ "ఆటోనగర్ సూర్య" చిత్రం హిట్టవటం నాగచైతన్యకు అత్యవసరం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.