English | Telugu

అర్జున్‌, జె.డి.చక్రవర్తి కాంబినేషన్‌లో ‘ఇద్దరు’. ఈనెల 18న విడుదల!

యాక్షన్‌కింగ్‌ అర్జున్‌, జె.డి.చక్రవర్తి కాంబినేషన్‌లో డి.ఎస్‌.రెడ్డి సమర్పణలో ఎఫ్‌. ఎస్‌. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మహమ్మద్‌ ఫర్హీన్‌ ఫాతిమ నిర్మాతగా ఎస్‌. ఎస్‌. సమీర్‌ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘ఇద్దరు’. ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్‌ డేట్‌ ఎనౌన్స్‌మెంట్‌ ప్రెస్‌మీట్‌ గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రతాని రామకృష్ణగౌడ్‌, టి.ప్రసన్నకుమార్‌, జె.వి.ఆర్‌. పాల్గొన్నారు. ఈ సినిమాను ఈ నెల 18న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు.

ఈ సందర్భంగా ప్రతాని రామకృష్ణ గౌడ్‌ మాట్లాడుతూ ‘ఈ సినిమాని సపోర్ట్‌ చేయడానికి వచ్చిన మా అన్న టి.ప్రసన్నకుమార్‌గారికి, జె.వి.ఆర్‌.గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సమీర్‌గారు నాకు ఎంతో మంచి ఆప్తులు. నేను డైరెక్ట్‌ చేసిన సినిమాకి ఆయన కో డైరెక్టర్‌గా పనిచేశారు. చాలా తెలివైన వ్యక్తి. యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ గారు మరియు జెడి చక్రవర్తి గారితో ఒక మంచి సినిమాను తీశారు. ప్రేక్షకుల సినిమా ఆదరించి పెద్ద సక్సెస్‌ చేయాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

టి.ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ ‘చిన్న సినిమా పెద్ద సినిమా చూడకుండా సినిమాని సపోర్ట్‌ చేస్తున్న మీడియాకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులు పెద్ద సక్సెస్‌ చేస్తారని ఆశిస్తున్నాను’ అన్నారు.

నిర్మాత డి.ఎస్‌.రెడ్డిమాట్లాడుతూ ‘ఇది ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వకుండా మంచి క్వాలిటీతో తీసిన సినిమా. ప్రేక్షకులందరూ ఈ సినిమా చూసి మంచి సక్సెస్‌ చేయాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

హీరోయిన్‌ సోని చరిష్ట మాట్లాడుతూ ‘నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్‌ సమీర్‌ గారికి కృతజ్ఞతలు. అర్జున్‌ గారు చక్రవర్తి గారు సినిమాలో నాకు చాలా సపోర్ట్‌ చేశారు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను’ అన్నారు.

దర్శకనిర్మాత సమీర్‌ మాట్లాడుతూ ‘ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని సపోర్ట్‌ చేసిన ప్రసన్నకుమార్‌గారికి, రామకృష్ణగౌడ్‌గారికి, జే వి ఆర్‌గారికి, రవిగారికి, డిఎస్‌ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమాని ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వకుండా మంచి మంచి లొకేషన్స్‌ లో హై క్వాలిటీ లో చేసాము. అర్జున్‌ గారు, చక్రవర్తి గారు పోటీ పడుతూ నటించారు.  అందరూ సపోర్ట్‌ చేయడం వల్ల ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాని అందరూ ఆదరించి పెద్ద సక్సెస్‌ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు.