Read more!

English | Telugu

విడాకులు తీసుకున్నారు..మళ్లీ కలుస్తున్నారు..!

బాలీవుడ్ జనాలకు విడిపోవడం చాలా ఈజీ. మంచినీళ్లు తాగినంత సింపుల్ గా బ్రేకప్ చెప్పేసుకుంటారు. అయితే మళ్లీ కలవడం అనేది మాత్రం చాలా రేర్ గానే జరుగుతుందండోయ్..ఇప్పుడు సల్మాన్ బ్రదర్ అర్బాజ్ ఖాన్, అతని భార్య మలైకా అరోరాలు ఈ రెండో రేర్ కేటగిరీలోకి వస్తారు. ఇద్దరిదీ లవ్ మ్యారేజ్ అయినా, పెళ్లి తర్వాత కలిసుండటం కష్టంగా ఉందని విడాకులకు అప్లై చేశారు. అయితే ఆ తర్వాత పెద్దలు నచ్చచెప్పారో, లేక వీళ్లిద్దరికే అనిపించిందో గానీ ఇప్పుడు ప్యాచ్ అప్ అయి, కలిసి జీవించాలని కోరుకుంటున్నారట. విడాకులకు అప్లై చేశారు కానీ అర్బాజ్ కు మలైకాను వదలడం ఇష్టం లేదని, అతనే ముందు చొరవ తీసుకుని ఆమెను ఒప్పించాడని బాలీవుడ్ జనాలు చెబుతున్నారు. త్వరలోనే మలైకా మళ్లీ అర్బాజ్ ఇంటికి మకాం మార్చబోతోందట. ఓ పక్క సల్మాన్ పెళ్లి వార్తలు, మరో పక్క అర్బాజ్ తిరిగి భార్యతో కలిసి జీవించటం లాంటివన్నీ చూస్తే, ఖాన్ ఫ్యామిలీకి మంచి టైం నడుస్తోందని బీటౌన్ జనాలు చెప్పుకుంటున్నారు.