English | Telugu

ఫెడరేషన్ స్ట్రైక్ వల్ల షుటింగులు బంద్

ఫెడరేషన్ స్ట్రైక్ వల్ల షుటింగులు బంద్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే గతంలో ఆంధ్రప్రదేశ్ సినీ ఎంప్లాయీస్ ఫేడరేషన్ తమ అసోసియేషన్లో మెంబర్లంతా సినిమా షుటింగుల్లో పాల్గొనరాదని నిర్ణయించింది. దీని వల్ల సినిమా పరిశ్రమలోని ఇరవై నాలుగు క్రాఫ్టుల కార్మికులూ సినిమా షుటింగుల్లో పాల్గొనరు. గతంలో ఫేడరేషన్ అడిగిన న్యాయమైన కోర్కెల ప్రకారం కార్మికుల జీతాలను పెంచాలని, అలా పెంచే వరకూ తమ సమ్మె కొనసాగుతుందనీ ఫెడరేషన్ వర్గాలంటున్నాయి. అవుట్ డోర్ షూటింగులకు వెళ్ళిన కార్మికులంతా వచ్చే సోమవారం నుండీ ఈ స్ట్రైక్ లో పాల్గొంటారని కూడా ఫెడరేషన్ వర్గాలు తెలియజేశాయి.


ఫేడరేషన్ అడిగిన న్యాయమైన కోర్కెల ప్రకారం కార్మికుల జీతాలను పెంచాలనే విషయం మీద నిర్మాతల మండలి స్పందిస్తూ తాము సౌతిండియాలో ఇచ్చే వేతనాల ప్రకారమే ఇవ్వగలం కాని, ఫెడరేషన్ అడిగే రీతిలో జితాలు పెంచలేమనీ, అలా పెంచటం వలన ప్రతి నిర్మాతకూ సినిమాకు రెండు నుండి మూడు కోట్ల రూపాయల అదనపు వ్యయభారం పడుతుందనీ వారంటున్నారు. ఫెడరేషన్ వారేమో హీరోలకూ, హీరోయిన్లకూ కోట్లకు కోట్లు పారితోషికం ఇవ్వటానికి మనసొప్పుతుంది కానీ కష్టపడే మాలాంటి కష్టజీవులకు కొద్దిపాటి జీతాలు పెంచమంటే భారమవుతుందంటున్నారు...ఇదేం న్యాయం...?అనిఅంటున్నారు. ఇది మరెంత కాలం ఇలా అంతూ పొంతూ లేకుండా సాగుతుందో ఆ దేవుడికే తెలియాలి.