Read more!

English | Telugu

ఎన్టీఆర్ పై అనుపమ్ ఖేర్ కామెంట్స్ వింటే షాకవుతారు!

జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) ఏ ముహూర్తాన బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2'(War 2) చేయడానికి అంగీకరించాడో గానీ, ప్రస్తుతం బాలీవుడ్ లో ఎన్టీఆర్ పేరు మారుమోగిపోతోంది. ఇటీవల 'వార్-2' షూటింగ్ కోసం ఎన్టీఆర్ అలా ముంబైలో అడుగుపెట్టాడో లేదో.. నేషనల్ మీడియాలో ఆయన పేరు ఓ రేంజ్ లో వినిపిస్తోంది. రీసెంట్ గా హృతిక్ రోషన్, రణబీర్ కపూర్ తో పాటు పలువురు బాలీవుడ్ స్టార్స్ తో కలిసి ఎన్టీఆర్ పార్టీలో పాల్గొన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాని షేక్ చేశాయి. ఇప్పుడు మరోసారి తారక్ వార్తల్లో నిలిచాడు. బాలీవుడ్ దిగ్గజ నటుడు అనుపమ్ ఖేర్(Anupam Kher).. ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించారు.

తాజాగా ఎన్టీఆర్ ని అనుపమ్ ఖేర్ కలిశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఆయన.. ఎన్టీఆర్ తో కలిసి దిగిన ఫొటోని షేర్ చేశారు. "నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి మరియు నటులలో ఒకరైన ఎన్టీఆర్ ని కలవడం చాలా ఆనందంగా ఉంది. అతను మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నాను." అంటూ అనుపమ్ ఖేర్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కి ఎన్టీఆర్ కూడా తనదైన శైలిలో రిప్లై ఇచ్చాడు. నటుడిగా అనుపమ్ ఖేర్ పనితనాన్ని ఆరాధిస్తానని చెప్పిన ఎన్టీఆర్.. "రాబోయే తరాల నటులకు మీరు స్ఫూర్తినిస్తూనే ఉండండి సార్" అని అన్నాడు.