English | Telugu

ఎక్స్‌పోజింగ్ చేయను - యాంకర్ అనసూయ


బుల్లితెర మీద మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ కిరీటాన్ని నెత్తిన పెట్టుకుని మోస్తున్న అనసూయ సినిమా అవకాశాలు వచ్చినా వద్దొంటోందట. అదే పనిగా నిర్మాతలు అడిగినా సినిమాల్లో ఎక్స్‌పోజింగ్ నా వల్ల కాదంటోందట. తెలుగు టీవి తెర మీద కురచ బట్టలు వేసుకుని సందడి చేసి ఎంతో మంది కుర్రకారు నిదుర పాడు చేసిన అనసూయ ఐటెం నెంబరు చేయడానికి మాత్రం నో అంటోందట. పెళ్లై ఇద్దరు పిల్లలున్నా తెరపై ఏ మాత్రం వన్నె తగ్గని ఈ అందగత్తెకు బుల్లితెరపై అవకాశాలకు కొదవేం లేదు. కానీ టీవీలో ఎక్స్‌పోజింగ్ కి ఏ మాత్రం తగ్గని అనసూయ, సినిమా అంటే నో ఎందుకు అంటుందో అంతు చిక్కటం లేదట సినీ వర్గాల వారికి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.