English | Telugu

అమీ తుమీ తేల్చుకుంటున్న అమీ

మెగాఫ్యామిలీ హీరోతో ఎంట్రీ అంటే మాటలా....కెరీర్ అలా వెళ్లిపోతుందనుకుంది అమీ జాక్సన్. ఎవడు లో రామ్ చరణ్ తో స్టెప్పులేసింది. సినిమాపై పాజటివ్ టాక్ వచ్చినా పిల్ల కి కలసిరాలేదు. మరోవైపు శంకర్ దర్శకత్వంలో అంటే ఆ చిత్రం ఘన విజయం సాధిస్తుందని ఆశపడింది. కానీ శంకర్ కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిపోయింది ఐ. దీంతో అమ్మడు అదుర్స్ అన్నా...ఆఫర్స్ ఇచ్చే వాళ్లు లేరు. ఆశ నెరవేరలేదే అని తెగ ఫీలైందట. కానీ ఆ తర్వాత కాంప్రమైజ్ అయిన బ్యూటీ...వచ్చిన వాటితో సర్దుకుపోతే బెస్టని డిసైడైందట.

గుడ్డికన్నా మెల్ల మంచిదే అన్నట్టు బాలీవుడ్ లో సింగ్ ఈజ్ బ్లింగ్ లో హీరోయిన్ గా ఎంపికైన ఈ బ్రిటీష్ బ్యూటీ.. కోలీవుడ్ లో ధనుష్ హీరోగా నటిస్తున్న సినిమాలోనూ సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. మరోవైపు జీవీ ప్రకాశ్ సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. గీత గీసుకుని కూర్చోకుండా దక్కిందే భాగ్యం అని ముందుకెళుతున్న అమీ జాక్సన్ ఏమేరకు క్లిక్కవుతుందో చూద్దాం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.