Read more!

English | Telugu

మీ కోసం  అంబాజీపేట మ్యారేజి బ్యాండు రెడీ.. డేట్ ఇదే 

చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా  కంటెంట్  బాగుంటే ప్రేక్షకాదరణ పొందుతుంది. హీరో ఎవరనేది కూడా అవసరం లేకుండా పోయింది. కాకపోతే పెద్ద హీరో అయితే ఓపెనింగ్ కలెక్షన్స్ వస్తాయి. ఆ తర్వాత  మౌత్ టాక్ బాగోకపోతే పలాయనం చిత్తగించవలసిందే.. ఇందుకు ఉదాహరణగా ఇటీవల ఎన్నో బడా సినిమాలు వచ్చాయి. ఇలాంటి టైం లో చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన మూవీ అంబాజీపేట మ్యారేజి బ్యాండు. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన  లేటెస్ట్ న్యూస్  ఒకటి వచ్చింది


సుహాస్ హీరోగా  వచ్చిన అంబాజీపేట మ్యారేజి బ్యాండు మొన్నఫిబ్రవరి 2 న థియేటర్స్ లోకి అడుగుపెట్టింది. చూసిన వాళ్ళందరూ బాగుందనే కితాబుని ఇచ్చారు.  కలెక్షన్లు కూడా బాగానే రాబట్టింది. ఆ తర్వాత  మార్చి 1 న  ఓటిటి లో కూడా  విడుదల అయ్యి మంచి విజయం సాధించింది. ఇప్పుడు టెలివిజన్ ప్రీమియర్ గా అడుగుపెట్టనుంది. ప్రముఖ టెలివిజన్ ఛానల్  స్టార్ మా లో  ఏప్రిల్ 28 2024 న మధ్యాహ్నం ఒంటి  గంటలకు  ప్రసారం కానుంది. ఈ వార్త సినీ ప్రియుల్లో ఆనందాన్ని తెస్తుంది.

ఐశ్వర్య రాజేష్,  శివాని నాగారం, శరణ్య ప్రదీప్, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటించారు. జి ఏ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించాడు.ధీరజ్ మొగిలినేని మరో నిర్మాతగా వ్యవహరించాడు.  శేఖర్ చంద్ర సంగీతాన్ని అందించగా   దుష్యంత్ కటికనేని దర్శకత్వం వహించాడు.మరి బుల్లి తెరపై ఏ విధమైన ఆదరణ పొందుతో చూడాలి.