English | Telugu

రాజకీయ భావజాలం ఏ మాత్రం లేదు..అనుమతులు తీసుకున్నాడా

శివ కార్తికేయన్(siva karthikeyan)సాయి పల్లవి జంటగా చేసిన అమరన్(amaran)ఈ నెల 31 న విడుదల కాబోతుంది.దేశం కోసం ప్రాణాలు విడిచిన  దివంగత మేజర్ ముకుంద్ వరదరాజన్(major mukund varadarajan)బయోపిక్ గా  తెరకెక్కిన ఈ మూవీలో శివ కార్తికేయన్ ముకుంద్ పాత్రలో చేస్తుండగా ఆయన భార్య ఇందు రెబెకా వర్గీస్‌(Indhu Rebecca Varghese)పాత్రలో సాయిపల్లవి(sai pallavi)కనిపించబోతుంది.రాజ్ కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై నూట యాభై కోట్ల భారీ వ్యయంతో విశ్వ కథానాయకుడు కమల్ హాసన్(kamal haasan)నిర్మిస్తుండగా రాజ్ కుమార్ పెరియస్వామి(Rajkumar Periasamy)దర్శకత్వాన్ని వహించాడు.

రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో దర్శకుడు రాజ్ కుమార్ మాట్లాడుతూ ఏ నటుడుని దృష్టిలో పెట్టుకొని అమరన్  కథ రాయలేదు.మొత్తం స్క్రిప్ట్ పూర్తయ్యాక ముకుంద్ కుటుంబ సభ్యుల్ని కలిసాను. తమిళ హీరో అయితే బాగుంటుందని వాళ్ళు చెప్పడంతో శివ కార్తికేయన్ ని ఎంపిక చేసాం. వైఫ్  క్యారక్టర్ లో చేయడానికి నిబద్దత గల నటి కావాలని నాతో పాటు యూనిట్ మొత్తం భావించింది.దాంతోనాకు ఎప్పటినుంచో తెలిసిన సాయి పల్లవి అయితే ఆ క్యారెక్టర్ కి న్యాయం చేయగలదని భావించి ఆమెని సెలెక్ట్ చేసాం.షూటింగ్ చాలా భాగం కాశ్మీర్ లో జరిగింది.ఆక్కడ ఎప్పుడు టెన్షన్ వాతావరణం ఉంటుంది. కానీ అక్కడే చిత్రీకరణ చెయ్యాలని చాలా ధృఢంగా భావించి రక్షణ శాఖ నుంచి అనుమతులు తీసుకొని మరి షూట్ చేసాం. భద్రత విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. 

చాలా మంది అమరన్ ని యాక్షన్ సినిమా అనుకుంటున్నారు.కానీ ఇది ఒక సైనికుడి జీవిత చరిత్ర.ముకుంద్ తన కుటుంబంతో గడిపిన రోజులతో పాటు సైన్యంలోని ప్రయాణాన్ని ఇందులో చూపించాం.ఎలాంటి రాజకీయ భావజాలాన్ని కూడా  ఉపయోగించలేదు. రాజ్ కుమార్ దర్శకత్వంలో 2017 లో రంగూన్ అనే చిత్రం వచ్చి మంచి విజయాన్ని అందుకోవడంతో అమరన్ పై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి.