English | Telugu

సాయిపల్లవి ఫోన్ పై కోటి పదిలక్షల రూపాయిలకి కేసు వేసిన విద్యార్థి 

శివకార్తికేయన్(siva karthikeyan)సాయిపల్లవి(sai pallavi)జంటగా రాజ్ కుమార్ పెరియస్వామి(raj kumar periyaswami)దర్శకత్వంలో దివాలి కానుకగా, ఈ నెల 31 న విడుదలైన మూవీ అమరన్(amaran)పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ మూవీ అన్ని ఏరియాల్లో రికార్డు కలెక్షన్స్ ని నమోదు చేసింది.అగ్ర హీరో కమల్ హాసన్(kamal haasan)అత్యంత భారీ వ్యయంతో నిర్మించగా తమిళనాడుకి చెందిన దివగంత మేజర్ ముకుంద్ వరద రాజన్ జీవిత కథ ఆధారంగా అమరన్ తెరకెక్కడం జరిగింది.

ఈ మూవీలో సాయిపల్లవి తన క్యారక్టర్ ప్రకారం శివ కార్తికేయన్ కి ఒక ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది.ప్రేక్షకులకి అర్థమయ్యేలా బహిరంగంగానే చెప్తుంది.ఇందుకోసం చిత్ర బృందం ఒక నెంబర్ ని ఉపయోగించడం జరిగింది.దీంతో కొంత మంది సాయి పల్లవి అభిమానులు,ఆ నెంబర్ నిజంగానే సాయి పల్లవి ఒరిజినల్ ఫోన్ నెంబర్ అని భావించి కాల్స్ చెయ్యడం మొదలుపెట్టారు.సినిమాలో వాడిన నెంబర్ నాదే అని,వరుస ఫోన్ కాల్స్ తో వ్యక్తిగత ప్రశాంతత అనేది లేకుండా పోయిందని, కుటుంబ సభ్యులతో సమయం కూడా గడపలేకపోతున్నానని విగ్నేష్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి చిత్ర బృందానికి లీగల్ నోటీసులు పంపించాడు.నష్ట పరిహారంగా కోటి పది లక్షల రూపాయలు ఇవ్వాలని అందులో పొందుపరిచాడు.

ఇప్పడు ఈ విషయం తమిళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా ఇండియన్ చిత్ర పరిశ్రమ లోనే హాట్ టిపిక్ గా మారింది. మరి ఈ విషయం మీద చిత్ర బృందం ఏ నిర్ణయం తీసుకుంటుందో అనే ఆసక్తి అందరిలో ఉంది.