Read more!

English | Telugu

‘అమర్‌ సింగ్‌ చమ్కీలా’ మూవీ రివ్యూ


మూవీ : అమర్ సింగ్ చమ్కీల
నటీనటులు: దిల్జిత్ దోసాంజ్, పరిణితి చోప్రా
రచన: షాజిద్ అలీ, ఇంతియాజ్ అలీ
ఎడిటింగ్: ఆర్తీ బజాజ్
సినిమాటోగ్రఫీ: సిల్వెస్టర్ ఫోన్సెకా
మ్యూజిక్: ఏ.ఆర్ రహమాన్
నిర్మాతలు: మోహిత్ చౌదరి, ఇంతియాజ్ అలీ
దర్శకత్వం: ఇంతియాజ్ అలీ
ఓటీటీ: నెట్ ఫ్లిక్స్

కథ:

అమర్ సింగ్ చమ్కీల పంజాబ్ లోని ఓ ప్రాంతంలో ప్రసిద్ధి గాంచిన సంగీత కళాకారుడు. అతడు పాడిన పాటలు ప్రపంచమంతా విస్తరించాయి. అలా తను సెలెబ్రిటీ అయ్యాక ఓ రోజు.. అతనికి సత్కారం చేయడానికి ఓ ఫంక్షన్ కి పిలుస్తారు‌. అలా చమ్కీల అతని భార్య కలిసి ఆ ప్రదేశానికి వెళ్తారు. ఇక వాళ్ళిద్దరు కారు దిగగానే కొంతమంది దుండగులు వారిపై దాడి చేస్తారు. ఇద్దరిని కాల్చి చంపేస్తారు. కాసేపటికి గుర్తుతెలియని కొంతమంది వ్యక్తులు వారిని హాస్పిటల్ లో పడేసి వెళ్తారు. ఆ తర్వాత వాళ్లని ఎవరు చంపారనే దానిపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. మరోవైపు కబీర్ సింగ్  చమ్కీలని చేరదీసానని చెప్తుంటాడు. అసలు కబీర్ సింగ్ కి చమ్కీలకి మధ్యగల సంబంధమేంటి? చమ్కీల అతని భార్యని ఎవరు చంపారనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

ఓ ప్రైవేట్ మీటింగ్ లో పట్టపగలు కొంతమంది దుండగలు ఫేమస్ సెలెబ్రిటీలు అయినటువంటి అమర్ సింగ్ చమ్కీల అతని భార్యని కాల్చు చంపేస్తారు. దాంతో కథ ఆసక్తిగా మొదలవుతుంది. ఇక వారెవరో ? ఎందుకు వాళ్లని చంపేసారనే క్యూరియాసిటిని ప్రేక్షకులలో కలిగించడంలో దర్శకుడు ఇంతియాజ్  సక్సెస్ అయ్యాడు.

ఈ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా తీసింది కాబట్టి ఇందులో క్యారెక్టర్లకి ఫైట్స్, సాంగ్స్, రొమాన్స్, సెంటిమెంట్ వంటి సీన్లు కంటే కూడా వారి శైలీ, స్థితిగతులను తెలియజేస్తూ వెళ్తాయి. ఇవన్నీ సహజసిద్ధంగా ఉండటంతో ప్రేక్షకుడికి చాలా సాధారణంగా అనిపిస్తుంది. హీరోయిన్, హీరో పాత్రల చుట్టూ జరిగే కొన్ని బ్యాక్ డ్రాప్ సీన్లు అనవసరంగా అనిపిస్తాయి. 1976 లో కచేరీలు చేస్తూ డబుల్ మీనింగ్ సాంగ్స్ పాడుతూ ఫేమస్ అయిన అమర్ సింగ్ చంకీల బయోపిక్ కాబట్టి ఇది చాలా సహజంగా చూపించడానికి దర్శకుడు చేసిన ప్రయత్నం స్క్రీన్ మీద తెలుస్తుంది. 

అప్పటి పరిస్థితులని మ్యాచ్ చేస్తూ తీసిన కొన్ని సీన్లు బోర్ కొడతాయి. అయితే స్క్రీన్ ప్లే కాస్త భిన్నంగా ఉంటుంది. నిడివి కాస్త ఎక్కువ ఉందని పూర్తిగా చూసాక తెలుస్తుంది. ఓవారాల్ గా చూసాక అయ్యో పాపం అప్పట్లో ఇలా జరిగిందా అనిపిస్తుంది. 

హిందీలో తీసిన సినిమాకి తెలుగు డబ్బింగ్ వర్షన్ మ్యాచ్ అవ్వలేదు. పాటలని తెలుగులోకి అనువదించకుండా అలాగే హిందీలోనే ఉంచేశారు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. అయితే సాంగ్స్ డబుల్ మీనింగ్ లో ఉంటాయి. అవి హిందీలోనే ఉన్నాయి కాబట్టి తెలుగు ప్రేక్షకులకి పెద్దగా అర్థం కాకపోవచ్చు.  స్లో సీన్స్ చాలానే ఉన్నాయి. హీరోకి ఉండే కొన్ని నెగెటివ్ షేడ్స్, పాజిటివ్ షేడ్స్ ని చక్కగా చూపించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఏఆర్ రహమాన్ సంగీతం ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

నటీనటుల‌ పనితీరు:

అమర్ సింగ్ పాత్రలో దిల్జిత్ దోసాంజ్ ఒదిగిపోయాడు. ఇక హీరోయిన్ పరిణితి చోప్రా బెస్ట్ సపోర్టింగ్ రోల్ చేసింది. ఇక మిగతా వారంతా వారి పాత్రలకి న్యాయం చేశారు.

ఫైనల్ గా :

ఓ సింగర్ యొక్క బయోపిక్ ని ఎలా తీయాలో అలానే తీసారు.  కాస్త ఓపికగా చూస్తే వన్ టైమ్ వాచెబుల్.

రేటింగ్ :  2.5 / 5

✍️. దాసరి మల్లేశ్