English | Telugu

జులాయి మళ్ళీ మొదలయ్యింది

"జులాయి" చిత్రం తరువాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో చిత్రం తెరకెక్కబోతుంది. "అత్తారింటికి దారేది" వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత త్రివిక్రమ్ మరోసారి తన మార్క్ స్టైల్ కొత్తదనాన్ని ఈ చిత్రంలో చూపించనున్నాడు. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రంలోని నటీనటుల ఎంపిక, అదే విధంగా బన్నీకి సరైన జోడి హీరోయిన్ ను వెతికే పనిలో ఉన్నాడు త్రివిక్రమ్. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నాడు. అదే విధంగా "రేసు గుర్రం" షూటింగ్ లో బిజీగా ఉన్నాడు బన్నీ. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను రేపు విడుదల చేయనున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.