English | Telugu

బ‌న్నీ అక్క‌డా దున్నేస్తున్నాడు

మ‌ల‌యాళంలో అల్లు అర్జున్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేద్దు. ఇక్క‌డ యావ‌రేజ్‌గా ఆడిన బ‌న్నీ సినిమాలు కూడా అక్క‌డ హిట్ట‌య్యాయి. ఇప్పుడు స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి కూడా మ‌ల‌యాళంలో హిట్ట‌య్యే ఛాన్సులున్నాయి. శుక్ర‌వారం ఈ సినిమా మ‌ల‌యాళంలో విడుద‌లైంది. మ‌లయాళంలో పేరున్న హీరోల సినిమాల‌కు చేసే ప‌బ్లిసిటీ ఈ సినిమాకీ చేశారు. బ‌న్నీ స్వ‌యంగా వెళ్లి అక్క‌డ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నాడు. ఎక్కువ థియేట‌ర్ల‌లో విడుద‌ల చేశారు. తొలి రోజు అన్నిచోట్లా హౌస్‌ఫుల్ వ‌సూళ్లు అందుకొందీ చిత్రం. బ‌న్నీ, నిత్య‌మీన‌న్, ఉపేంద్ర‌, స్నేహా.. వీళ్లంతా అక్క‌డ తెలిసిన మొహాలే. అందుకే ఈ సినిమాకి అన్ని క‌లెక్ష‌న్లొచ్చాయి. తొలి రోజు మ‌ల‌యాళంలో ఈ సినిమాకి రూ.3 కోట్ల వ‌ర‌కూ వ‌సూళ్లు ద‌క్కే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.