English | Telugu

అల్లు అర్జున్ చిత్రం పేరు "హనీ" కాదట

అల్లు అర్జున్ చిత్రం పేరు "హనీ" కాదట. వివరాల్లోకి వెళితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, నలకనడుము గోవా సుందరి ఇలియానా హీరోయిన్ గా, స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న విభిన్నప్రేమకథా చిత్రం "హనీ". కానీ ఈ "హనీ" అనే పేరుని తాము తమ చిత్రానికి నిర్ణయించలేదని ఈ చిత్రం యూనిట్ అంటూందట. ఈ "హనీ" అనే పేరేదో అమ్మాయిని సంబోధిస్తున్నట్లుగా ఉందని అనుకుని ఈ చిత్రం యూనిట్ బహుశా ఆ అభిప్రాయానికి వచ్చుంటుంది.

అల్లు అర్జున్ "బద్రీనాథ్" వంటి ఫ్లాప్ తర్వాత హీరోగా నటిస్తున్న సినిమా ఇదే గనుక ఈ చిత్రం హిట్టవటం అతని అత్యవసరం. అలాగే మహేష్ బాబు హీరోగా వచ్చిన "ఖలేజా" చిత్రం కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించక పోవటంతో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి కూడా ఈ చిత్రం హిట్టవటం అంతే ముఖ్యం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.