English | Telugu
అల్లు అర్జున్ కేసుపై మాట్లాడిన సిఎం రేవంత్ రెడ్డి
Updated : Dec 13, 2024
పుష్ప 2(pushpa 2)బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడంతో పాటు,ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయాలు పాలవడానికి కారణమయ్యాడనే కారణంతో అల్లు అర్జున్(allu arjun)ని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనకీ గాంధీ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది.ఇక ఈ కేసులో అల్లు అర్జున్ తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్ వెయ్యగా సాయంత్రం నాలుగు గంటలకు విచారిస్తామని, అరెస్ట్ చేసిన విధానంపై కూడా వాదనలు కూడా వింటామని హైకోర్టు వెల్లడించింది
ఇక ఈ విషయంపై తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి(revanth reddy)మాట్లాడుతు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. కేసు దర్యాప్తులో నా జోక్యం ఏమీ ఉండదు. తొక్కిసలాటలో చనిపోవడం వల్లే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పడం జరిగింది.