English | Telugu
హైకోర్టులో అల్లుఅర్జున్ పిటిషన్..కొత్త మలుపు తిరిగిన సంధ్య థియేటర్ కేస్
Updated : Dec 11, 2024
పుష్ప 2(pushpa 2)బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి(revathi)అనే మహిళ చనిపోవడంతో పాటు,ఆమె కుమారుడు శ్రీతేజ్(sri tej)గాయాలు పాలయ్యిన సంఘటనలో పోలీసులు అల్లు అర్జున్ ని నిందితుడిగా చేర్చి కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ఈ కేసులో అల్లు అర్జున్(allu arjun)తనపై నమోదైన కేసుని కొట్టి వెయ్యాలని హైకోర్టులో ఒక పిటిషన్ వెయ్యడం జరిగింది. మరి అల్లు అర్జున్ విషయంలో కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.ఇక అల్లు అర్జున్ కొన్ని రోజుల క్రితం రేవతి మరణంపై ఒక వీడియో కూడా విడుదల చేసాడు.అందులో ఆయన మాట్లాడుతు రేవతి గారి మరణంతో నాతో పాటు యూనిట్ మొత్తం షాక్ కి గురయ్యింది.
పుష్ప సక్సెస్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన మూడ్ కూడా లేకుండా పోయింది.ఆమె కుటుంబానికి సంబంధించిన బాధ్యతలు మొత్తం చూసుకోవడంతో పాటు మొదట విడతగా పాతిక లక్షలు ఇస్తున్నాను. హాస్పిటల్ లో బాబు కి అయ్యే ఖర్చులు మొత్తాన్నికూడా నేనే భరిస్తానని చెప్పడం జరిగింది. గాయపడిన బాబు ఇంకా హాస్పిటల్ లోనే ఉండగా ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటకి వచ్చాడని డాక్టర్స్ వెల్లడించారు.