English | Telugu
తేజ్ గురించి అల్లుఅరవింద్ కీలక వ్యాఖ్యలు..మెగా ఫ్యాన్స్,అల్లు ఫ్యాన్స్ వేరు వేరు
Updated : Dec 13, 2024
సుప్రీంహీరో సాయిదుర్గాతేజ్ ప్రస్తుతం ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై 'హనుమాన్' మూవీ ఫేమ్ నిరంజన్ రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మాణ సారధ్యంలో కెపి రోహిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న'ఎస్ వైజి' సంబరాల యేటి గట్టు' అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ మేరకు నిన్ననే ఒక ఈవెంట్ ని ఏర్పాటు చేసిన మేకర్స్ అందులో టైటిల్ లాంచింగ్ తో పాటు గ్లింప్స్ ని కూడా రిలీజ్ చెయ్యడం జరిగింది.ఇక ఈవెంట్ కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిధిగా హాజరు కాగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా వన్ ఆఫ్ ది గెస్ట్ గా రావడం జరిగింది.
ఈ సందర్భంగా తేజ్ గురించి అల్లు అరవింద్ మాట్లాడుతు గ్లింప్స్ లో సాయిధరమ్ తేజ్ ని చూస్తుంటే
నా ఒళ్ళు గగుర్పాటుకి గురయ్యింది.అంత బాడీని తేజ్ ఎప్పుడు పెంచాడనే ఆశ్చర్యం కూడా వేస్తుంది. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి.తేజ్ ఫోన్ చేసి మావయ్య నువ్వు నా ఫంక్షన్ కి వచ్చి టెన్ ఇయర్స్ అవుతుంది.ఈ సారి రావాల్సిందే అనే సరికి అన్నిసంవత్సరాల అయ్యిందా అని నేనే షాక్ కి గురయ్యాను.పైగా ఈ ఫంక్షన్ కి రాగానే తేజ్ కి ఫస్ట్ సినిమాకి అవకాశం ఇచ్చిన ఫీలింగ్ మళ్ళీ కలుగుతుంది.మా విజయ దుర్గ అదృష్టవంతురాలు.తల్లి పేరుని తన పేరులో పెట్టుకున్న తేజ్ లాంటి కొడుకు ఎక్కడ దొరుకుతాడు. ఆల్రెడీ తేజ్ మృత్యంజయుడు కాబట్టి కలకలాం విజయాల్ని వరిస్తు ముందుకెళ్లాలి.సినిమా బిగ్గెస్ట్ హిట్ కావాలని కోరుకుంటున్నాను .
ఫంక్షన్ కి విచ్చేసిన మెగా,పవర్ స్టార్,మెగా పవర్ స్టార్,సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్ అభిమానులకి నా శుభాభివందనాలని చెప్పుకొచ్చాడు.దీంతో మెగా అభిమానులు, అల్లు అభిమానులు వేరని అరవింద్ నే చెప్పినట్టయింది.