English | Telugu

నరేష్ సినిమాలో "బిజినెస్ మ్యాన్" స్ఫూఫ్

నరేష్ సినిమాలో "బిజినెస్ మ్యాన్" స్ఫూఫ్ ఉందట. వివరాల్లోకి వెళితే నిర్మాతల పాలిట కల్పతరువు, మినిమమ్ గ్యారెంటీ హీరో అల్లరి నరేష్ హీరోగా, భీమినేని శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించబడుతున్న చిత్రం "సకలకళావల్లభుడు". ఈ చిత్రంలో అల్లరి నరేష్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అల్లరి నరేష్ ద్విపాత్రాభినయం చేయటం ఇదే తొలిసారి. ఈ చిత్రంలో ఒక నరేష్ సరసన హేమ జోడీగా నటిస్తూందట.

ఈ "సకలకళావల్లభుడు" చిత్రంలో అల్లరి నరేష్ "బిజినెస్ మ్యాన్" చిత్రంలోని డైలాగులో, లేక సీనో కానీ, దాన్ని తీసుకుని స్ఫూఫ్ చేస్తున్నాడట. ఈ "సకలకళావల్లభుడు" చిత్రం ఇప్పటికి దాదాపు 80% పూర్తయింది. జనం ఒక నరేష్ కనిపిస్తేనే ఆ సినిమాని తెగ చూస్తారు.ఇక ఇద్దరు నరేష్ లు కలిస్తే ఇక చెప్పేదేముంది. ఈ చిత్రం ఈ మార్చిలో విడుదల కానుందట.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.