English | Telugu

అఖండ-2 రిలీజ్ డేట్ వచ్చేసింది.. బాలయ్య పాన్ ఇండియా తాండవం!

 

టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ కి ఉండే క్రేజే వేరు. వీరి కాంబోలో ఇప్పటిదాకా 'సింహా', 'లెజెండ్', 'అఖండ' సినిమాలు రాగా.. మూడు ఒక దానిని మించి ఒకటి విజయం సాధించాయి. ముఖ్యంగా 'అఖండ' సంచలన విజయం సాధించింది. ఇక ఇప్పుడు వీరి కాంబినేషన్ లో 'అఖండ 2 - తాండవం' రూపొందుతోంది. అసలే బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్, దానికితోడు 'అఖండ' సీక్వెల్ కావడంతో.. కేవలం ప్రకటనతోనే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. (Akhanda 2)

 

తాజాగా 'అఖండ-2' షూటింగ్ ప్రారంభమైనట్లు మేకర్స్ ప్రకటించారు. అంతేకాదు, విడుదల తేదీని కూడా ప్రకటించి సర్ ప్రైజ్ చేశారు. దసరా కానుకగా 2025, సెప్టెంబర్ 25న 'అఖండ-2' విడుదల కానుంది. ఈ సందర్భంగా ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. త్రిశూలం పట్టుకొని ఉన్న చేతితో ఉన్న పోస్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. 

 

బాలకృష్ణ కుమార్తె తేజస్విని సమర్పణలో 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట 'అఖండ-2'ని నిర్మిస్తున్నారు. ఇది పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. థమన్ సంగీతం అందించనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్స్ గా సి రామ్ ప్రసాద్, సంతోష్, ఆర్ట్ డైరెక్టర్ గా ఏ.ఎస్. ప్రకాష్, ఎడిటర్ గా తమ్మిరాజు వ్యవహరిస్తున్నారు.