Read more!

English | Telugu

అందాన్ని ఉపయోగించుకోవడం తెలుసు.. ప్రేమతో పాటు ప్రతీకారం ఉంటుంది   

అదితి రావు హైదరి.. 2006 లో వచ్చిన  మలయాళ చిత్రం ప్రజాపతితో సినీ రంగ ప్రవేశం చేసింది. ప్రెజంట్ తన ఖాతాలో   తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి  30 చిత్రాలకి పైనే ఉన్నాయి. ముఖ్యంగా హిందీలో రాక్ స్టార్, పద్మావత్,మర్డర్ 3 లాంటి  భారీ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపుని పొందింది. రీసెంట్ గా భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ గొప్ప   దర్శకుడు  సంజయ్ లీల భన్సాలీ డ్రీం ప్రాజక్ట్ హీరామండి ది డైమండ్ బజార్ లో నటిస్తుంది. ఈ క్రమంలో ఆమె చెప్తున్న మాటలు ఆసక్తి గా మారాయి

అదితి హీరామండి లో ఒక వేశ్య పాత్రలో  కనపడనుంది. స్వేచ్ఛ కోసం అందాన్ని సైతం ఆయుధంగా ఉపయోగించుకునే కళ ఈ బిబ్బోజాన్ కి మాత్రమే  తెలుసు. ఈ డైలాగ్ తో   మేకర్స్  తన పాత్రని  పరిచయం చేసారు. దీంతో ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తన  క్యారక్టర్ కి సంబంధించిన పలు విషయాలని  వెల్లడించింది. బిబోజాన్ స్వచ్ఛమైన మనసు ఉన్న వేశ్య. ఎక్కడ పుట్టిందో ఎలాంటి పరిస్థితుల్లో వేశ్యగా మారిందో  తెలియని అయోమయ పరిస్థితి. ఆమెది. కానీ తన లక్ష్యాన్ని చేరుకోడానికి మాత్రం ఎంత దూరమైనా వెళ్తుంది.  

ఇక  దర్శకుడు బన్సాలి నా అభిమాన దర్శకుడు. ఆయన సినిమాల్లోని స్త్రీలు ఎంత ప్రేమని చూపిస్తారో అంతే  స్థాయిలో ప్రతీకారం తీర్చుకోగలరు. నిజ జీవితంలో కూడా అలాగే ఉంటానని  చెప్పుకొచ్చింది. అదితి తో పాటు మనీషా కోయిరాల, సోనాక్షి సిన్హా, సంజిదా షేక్ ,రిచా చద్దా లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హీరామండి లో  ఈ ఐదుగురు కూడా  వేశ్యలుగా కనిపించనున్నారు. మే 1 న ఓటిటి వేదికగా నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. ఇక అదితి కి ఇటీవలే ప్రముఖ హీరో సిద్దార్ధ్ తో ఎంగేజ్ మెంట్ జరిగింది. త్వరలోనే  వివాహం జరగనుంది