Read more!

English | Telugu

లోక్‌సభ అభ్యర్థిగా రాధిక శరత్‌కుమార్‌.. ఏ పార్టీ నుంచో తెలుసా?

సినిమా రంగంలో రాణించి అవకాశాలు తగ్గిన తర్వాత రాజకీయాల్లోకి వెళ్లడం సినీతారలకు అలవాటే. సౌత్‌ ఇండియన్‌ మూవీస్‌లో హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న రాధిక 2006లోనే ఎఐఎడిఎంకె పార్టీలో భర్త శరత్‌కుమార్‌తో కలిసి చేరింది. ఆ తర్వాత పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న ఆరోపణపై ఆమెను పార్టీ నుంచి డిస్మిస్‌ చేశారు. 

2007లో ఆల్‌ ఇండియా సమతువ కచ్చి పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు శరత్‌కుమార్‌. ఈ పార్టీ వైస్‌ ప్రెసిడెంట్‌ పదవిలో కొనసాగారు రాధిక. ఇటీవల తన పదవికి రాజీనామా చేసింది రాధిక. ఈ క్రమంలోనే తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు శరత్‌కుమార్‌. రాబోతున్న లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని విరుధ్‌ నగర్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా రాధిక పోటీ చేయబోతోంది. ఈ ఎన్నికల్లో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కోయంబత్తూర్‌ నుంచి పోటీ చేస్తుండగా, తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్‌ తమిళిసై చెన్నై సౌత్‌ నుంచి బరిలోకి దిగుతున్నారు.