English | Telugu

రజనీకాంత్ అభిమానికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు..యాభై గంటల రికార్డు 

సూపర్ స్టార్ రజనీకాంత్(rajinikanth)కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. రజనీ ఏది చెప్తే అది చెయ్యడానికి కొన్ని లక్షల మంది ఫ్యాన్స్  రెడీగా ఉంటారు. సినిమా పరిశ్రమలోని నటులు కూడా అందుకు అతీతులు కాదు. చాలా సందర్భాల్లో ఈ విషయం నిరూపితమైంది. కానీ ఇప్పుడు అది ఏకంగా గిన్నిస్ బుక్ సాధించే వరకు వెళ్ళింది.

ప్రముఖ యువ నటుడు విగ్నేష్(vigesh kanth)కి  తమిళనాట మంచి గుర్తింపు ఉంది. తాజాగా ఆయన చిత్ర పరిశ్రమకి చెందిన కొంత మంది నటులు, దర్శకులు, రజనీ వీరాభిమానులతో కలిసి లైవ్ పాడ్ కాస్ట్ ప్రోగ్రాంని నిర్వహించాడు. ఇందులో ఏముంది ఎప్పడు జరిగేదే అనుకునే అవకాశాన్ని ఇవ్వకుండా విగ్నేష్ ఒక చరిత్రనే  సృష్టించాడు.నిర్విరామంగా యాబై గంటల పాటు తలైవా కి సంబంధించిన విశేషాలని వారందరితో  పంచుకున్నాడు.సెప్టెంబర్ ఆరు న ప్రారంభమయ్యిన ప్రోగ్రాం  సెప్టెంబర్ ఎనిమిది సాయంత్రం ఎనిమిది గంటల వరకు నిర్విరామంగా కొనసాగింది. దీంతో  ఏకంగా  గిన్నిస్ బుక్ రికార్డుని సాధించింది. ప్రముఖ దర్శకుడు శశి కుమార్  చేతుల మీదుగా ఆ  గిన్నిస్ రికార్డు ని అందుకున్నాడు.

ఇక  రజనీ కాంత్ కి  ఈ విషయం తెలియడంతో విగ్నేష్ ని అభినందిస్తూ  ఒక వాయిస్ నోట్ ని పంపాడు.మిమల్ని ఎలా  అభినందించాలో తెలియడం లేదు.యాభై గంటలు ఇంటర్వ్యూ చేసారంటే అది మాములు విషయం కాదు.హాట్స్ ఆఫ్ టూ యు. మీ అభిమానానికి ప్రతిఫలంగా నేనేం ఇవ్వాలో తెలియటం లేదు. ఎప్పటికి మీరు నా హృదయంలో ఉంటారు .లవ్ యు అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసాడు. రజనీ ప్రస్తుతం వెట్టియాన్ తో బిజీగా ఉన్నాడు. వరల్డ్ వైడ్ గా అక్టోబర్ పది న విడుదల కాబోతుంది. తెలుగులో వేటగాడు  పేరుతో  రాబోతుంది.అమితాబ్ బచ్చన్ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు.