Read more!

English | Telugu

'బింబిసార'ను మించేలా 'కార్తికేయ-2' కలెక్షన్స్!

బాక్సాఫీస్ దగ్గర 'కార్తికేయ-2' కలెక్షన్ల జోరు కొనసాగుతూనే ఉంది. లిమిటెడ్ స్క్రీన్స్ లో విడుదలైన ఈ చిత్రం రోజురోజుకి స్క్రీన్స్ పెంచుకుంటూ.. ఐదు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.21 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. ప్రస్తుతం 'కార్తికేయ-2' జోరు చూస్తుంటే త్వరలోనే 'బింబిసార', 'సీతా రామం' సినిమాల కలెక్షన్లకు దాటేలా ఉంది.

 

ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో రూ.11.30 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన 'కార్తికేయ-2'.. మొదటి రోజు రూ.3.50 కోట్ల షేర్, రెండో రోజు రూ.3.81 కోట్ల షేర్, మూడో రోజు రూ.4.23 కోట్ల షేర్, నాలుగో రోజు రూ.2.17 కోట్ల షేర్, ఐదో రోజు రూ.1.61 కోట్ల షేర్ రాబట్టింది. వీక్ డేస్ లోనూ జోరు చూపిస్తున్న ఈ చిత్రం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి ఐదు రోజుల్లో రూ.15.32 కోట్ల షేర్(24 కోట్ల గ్రాస్)తో సత్తా చాటింది. ఐదు రోజుల్లో నైజాంలో రూ.5.72 కోట్ల షేర్(బిజినెస్ 3.50 కోట్లు), సీడెడ్ లో రూ.2.38 కోట్ల షేర్(బిజినెస్ 1.80 కోట్లు), ఆంధ్రాలో రూ.7.22 కోట్ల షేర్(బిజినెస్ 6 కోట్లు) వసూలు చేసింది.

 

నార్త్ ఇండియాలో 2.20 కోట్ల షేర్, కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా 1.23 కోట్ల షేర్, ఓవర్సీస్ 2.75 కోట్ల షేర్ కలిపి.. వరల్డ్ వైడ్ గా ఐదు రోజుల్లో 21.50 కోట్ల షేర్(37.75 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ గా 12.80 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ.. ఐదు రోజుల్లోనే బయ్యర్లకు రూ.8 కోట్లకు పైగా లాభాలు తీసుకురావడం విశేషం.

 

తెలుగుతో పాటు హిందీ మార్కెట్ లోనూ రోజురోజుకి స్క్రీన్స్ పెంచుకుంటున్న 'కార్తికేయ-2' త్వరలోనే 'బింబిసార', 'సీతా రామం' సినిమాల కలెక్షన్లకు బీట్ చేసేలా ఉంది. ఇప్పటిదాకా(13 రోజుల్లో) 'బింబిసార' రూ.32.93 కోట్ల షేర్ రాబట్టగా, 'సీతా రామం' రూ.28.54 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. మరి ఫుల్ రన్ లో 'కార్తికేయ-2' ఈ రెండు చిత్రాలను దాటేస్తుందేమో చూడాలి.