English | Telugu

మాఫియా చేతిలో దెబ్బలు తిన్న వరుణ్ సందేశ్

"హ్యాపీ డేస్" చిత్రంతో హీరోగా పరిచయమైన వరుణ్ సందేశ్ మాఫియా గ్యాంగ్ తో తన్నులు తిన్నాడట. రెమ్యునరేషన్ తగ్గించి వచ్చిన సినిమా అవకాశాలన్నీ ఒప్పేసుకుంటూ బిజీగా ఉన్న వరుణ్ ప్రస్తుతం మంచు వారి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ మధ్యే షూటింగ్ కోసం బ్యాంకాక్ కూడా వెళ్లారు. అయితే షూటింగ్ అయిపోయాక ఖాళీ సమయంలో ఖాళీగా ఉండలేక ఎవరో బ్యాంకాక్ అమ్మయికి కావాలనే డాష్ ఇచ్చారంట. మనోడు సినిమాల్లో లాగా వచ్చి హాయ్ చెప్పి మాట్లాడితే లైన్ లో పెట్టచు అనుకున్నాడు కానీ, అక్కడ సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.

ఆ అమ్మాయికి మాఫియా గ్యాంగ్ తో సంబంధం ఉండటంతో అక్కడే ఉన్న తన గ్యాంగ్ కి చెప్పడంతో... ఆ అమ్మాయి గ్యాంగ్ వచ్చి వరుణ్ సందేశ్ కు బాగానే తన్ని బుద్ధి చెప్పారంట.

ఈ గొడవ తెలుసుకున్న మంచు మనోజ్ పోలీసుల సహాయంతో వెంటనే అక్కడికి చేరుకొని వరుణ్ ను తన హోటల్ కి తీసుకేల్లాడంట. ఏదేమైనా కూడా వరుణ్ కి కాస్త దూల ఎక్కువేనని టాలీవుడ్ టాక్.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.