English | Telugu

బిజినెస్ మాన్ తో త్రిష పెళ్లి.. హనీమూన్ షెడ్యూల్ చెప్పమంటున్న త్రిష

సౌత్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ 'త్రిష'(Trisha)కి ఉన్న పాపులారిటీ తెలిసిందే. దాదాపుగా సౌత్ లో ఉన్న అందరి అగ్రహీరోలతో జతకట్టి ఎన్నో భారీ హిట్స్ ని అందుకుంది. ఈ ఏడాది కమల్ హాసన్(Kamal Haasan),అజిత్(Ajith)ప్రీవియస్ చిత్రాలైన థగ్ లైఫ్, గుడ్ బాడ్ అగ్లీ లో అద్భుతమైన పెర్ఫార్మ్ తో మరోసారి ప్రేక్షకులని మెస్మరైజ్ చేసింది. చండీగఢ్ కి చెందిన వ్యాపారవేత్తని త్రిష పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మీడియా ఛానల్స్ సైతం పెళ్లిని అధికారంగా ధృవీకరిస్తూ పలు కథనాల్ని ప్రచురిస్తూ వస్తున్నాయి.

ఇప్పుడు ఈ వార్తలపై త్రిష సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు 'నాకోసం నా జీవితాన్ని ప్లాన్‌ చేస్తున్న జనాలని నేను ప్రేమిస్తాను. హనీమూన్‌ షెడ్యూల్‌ కూడా చెబుతారేమోనని వేచి చూస్తున్నా' అంటూ ఇన్ స్టాగ్రామ్ వేదికగా సెటైరికల్ పోస్ట్ లాంటిది చేసింది. ఆ పోస్ట్ చూస్తుంటే తను పెళ్లి చేసుకోవడం లేదనే విషయం అర్ధమవుతుంది. వాస్తవానికి 2015 వ సంవత్సరంలోనే త్రిషకి వరుణ్‌ మణియన్‌ అనే వ్యాపారవేత్తతో నిశ్చితార్థం జరిగింది. అయితే అది పెళ్లి వరకూ వెళ్లలేదు. కొన్ని కారణాల వల్ల ఇరువురు ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు.

కెరీర్ పరంగా చూసుకుంటే త్రిష ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)తో 'విశ్వంభర'లోను, సూర్య(Suriya)తో కరుప్పు లోను చేస్తుంది. ఈ రెండు చిత్రాలు కూడా ఎంతో ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్స్ గా తెరకెక్కుతున్నాయి. చెన్నై(Chennai)కి చెందిన త్రిష వయసు ప్రస్తుతం 42 సంవత్సరాలు.


పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.