English | Telugu

బర్త్ డే సందర్భంగా రాజాసాబ్ లకలక రిలీజ్ 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas)వన్ మాన్ షో రాజాసాబ్(raja saab)షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.ఏప్రిల్ పది న విడుదల కాబోతున్న ఈ మూవీ మీద అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.కొన్ని రోజుల క్రితం విడుదలైన ప్రభాస్ లుక్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి.

కొద్దీసేపటి క్రితం ప్రభాస్ బర్త్ డే సందర్భగా రాజా సాబ్ మోషన్ వీడియోని చిత్ర బృందం రిలీజ్ చేసింది.నిర్మానుష్యమైన అడవిలో ఒక పియానో మీద హ్యాపీ బర్త్ డే అని వస్తుంది. ఆ తర్వాత ఒక పెద్ద రాజ భవంతిలో మధ్య వయస్కుడి గెటప్ లో ఉన్న ప్రభాస్ ఒక కుర్చీ లో కూర్చొని చుట్ట తాగుతూ ఉన్నాడు. హార్రర్ అనేది కొత్త హాస్యం అనే క్యాప్షన్ ని ఇచ్చి సినిమా ఎలా ఉండబోతుందో జస్టిఫై కూడా ఇచ్చారు.థమన్ ఆర్ఆర్ కూడా ఒక రేంజ్ లో ఉంది.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై రాజా సాబ్ ని అత్యంత భారీ వ్యయంతో టి జె విశ్వప్రసాద్(tj viswaprasad)నిర్మిస్తుండగా మారుతీ(maruthi)దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. ప్రభాస్ చేస్తున్న ఫస్ట్ హర్రర్ అండ్ కామెడీ మూవీ ఇదే.నిధి అగర్వాల్, మాళవిక మోహన్ హీరోయిన్లు గా చేస్తున్నారు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.