English | Telugu

The Raja Saab: 'ది రాజా సాబ్' ఫస్ట్ డే కలెక్షన్స్.. ఇంత తక్కువా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) తాజాగా 'ది రాజా సాబ్'తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మొదటి షో నుంచే డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్నప్పటికీ.. ప్రభాస్ సినిమా కావడంతో ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా ఎంత కలెక్ట్ చేస్తుంది? మొదటి రోజే వంద కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. (The Raja Saab)

'ది రాజా సాబ్' విడుదల జనవరి 9న కాగా, జనవరి 8 రాత్రి ప్రీమియర్స్ ను ప్రదర్శించారు. ప్రీమియర్స్ ద్వారానే ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.20 కోట్ల గ్రాస్ రాబట్టింది. తెలంగాణలో సాధారణ ధరలతో ఒకటి అరా షోలు తప్ప.. స్టార్ హీరో సినిమా స్థాయిలో టికెట్ హైక్స్ తో భారీ సంఖ్యలో ప్రీమియర్స్ పడలేదు. లేదంటే అదనంగా మరో 7-8 కోట్ల గ్రాస్ వచ్చేదని అంచనా.

Also Read: రాజు గారికి హ్యాండిచ్చిన మారుతి.. నమ్మి అవకాశమిస్తే..?

ప్రీమియర్స్ తో కలిపి తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు రూ.60 కోట్ల గ్రాస్ దాకా రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వరల్డ్ వైడ్ గా రూ.85 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశముంది. హారర్ కామెడీ జానర్, డివైడ్ టాక్ ని దృష్టిలో పెట్టుకుంటే.. ఇవి చాలా మంచి ఓపెనింగ్స్. కానీ అక్కడున్నది ప్రభాస్ కనుక.. ఆయన స్థాయి ఓపెనింగ్స్ ఇవి కాదనే అభిప్రాయముంది.

ప్రభాస్ గత మూడు చిత్రాలు 'ఆదిపురుష్', 'సలార్', 'కల్కి' మొదటి రోజే రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరాయి. ఇప్పుడు 'రాజా సాబ్' రూ.85 కోట్లతోనే సరిపెట్టుకోనుందని ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి.