English | Telugu
అది ఉన్నచోట నేరాల రేటు తక్కువంటూ బాంబు పేల్చిన థమన్
Updated : Nov 16, 2024
కిక్ తో సినీరంగ ప్రవేశం చేసిన తమన్(thaman) ఎన్నో సినిమాలకి సూపర్ హిట్ బాణీలని అందించి అగ్ర సంగీత దర్శకుడుగా ఎదిగాడు.ప్రస్తుతం ఆయన చేతిలోడాకు మహారాజ్,ఓజి,రాజాసాబ్,గేమ్ చేంజర్,అఖండ 2 ,తెలుసు కాదా వంటి బడా ప్రాజక్ట్స్ ఉన్నాయి. డిసెంబర్ 5 న రాబోతున్న అల్లు అర్జున్ వన్ మాన్ షో పుష్ప పార్ట్ 2 మూవీ ప్రథమార్థంలో వచ్చే మొదటి మూడు రీల్స్ కి తమన్ నే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని అందించాడు.
ఈ రోజు తమన్ పుట్టిన రోజు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆర్ధికంగా వెనుకబడిన వారికి సంగీతం నేర్పించాలని అనుకుంటున్నాను.దాని కోసం మ్యూజిక్ స్కూల్ కట్టాలనేది నా కోరిక. రెండు మూడేళ్ళలోనే హైదరాబాద్ లోనే ప్రపంచ స్థాయి మ్యూజిక్ స్కూల్ నిర్మిస్తాను.ఇందుకు ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తుందేమోనని ఎదురుచూస్తున్నాను.
అలా అని స్థలం ఏమి కోరటం లేదు.గుర్తింపు ఇవ్వమని ఆశిస్తున్నాను.అందులోనే మ్యూజిక్ స్కూల్ ఉంటుంది. నేను నమ్మేది ఒక్కటే సంగీతం ఉన్న చోట నేరాల రేటు చాలా తక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చాడు.అదే విధంగా నేను నిర్మాతల సంగీత దర్శకుణ్ణి, వాళ్ళ ఖర్చులు తగ్గించి నష్టపోకుండా చూడాలనే ఆలోచిస్తాను.బయట దేశాలకి వెళ్లి ట్యూన్స్ చెయ్యాలని ఎప్పుడు అనుకోలేదు.ఆటోలో కూర్చొని మ్యూజిక్ చెయ్యమన్నాచేసేస్తానని తెలిపాడు.