English | Telugu
అంధయువకుడికి వరాన్ని ప్రకటించిన థమన్
Updated : Nov 14, 2024
కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియా వేదికగా రాజు(raju)అనే అంధయువకుడు పాడిన పాట వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.కృష్ణవంశీ(krishna vamsi)దర్శకత్వంలో నితిన్(nitiin)హీరోగా వచ్చిన శ్రీ ఆంజనేయం(sri anjaneyam)మూవీలోని 'రామ రామ రఘురామా అని పాడుతున్న హనుమ, అంత భక్తి పరవశమా ఓ కంట మమ్ము కనుమ' అనే పాటని చాలా అద్భుతంగా పాడాడు.
ఇప్పుడు అతని గురించి ప్రముఖ సంగీత దర్శకుడు థమన్(thaman)ట్విట్టర్ వేదికగా ప్రస్తావిస్తూ ఈ అబ్బాయికి చాలా గొప్ప టాలెంట్ ఉంది.శృతిలో చాలా స్పష్టంగా పాడుతున్నడు.దేవుడు కొన్ని సార్లు కఠినంగా ఉన్నాడని కనిపిస్తాడు.అయితేనేం అతడి టాలెంట్ ని గుర్తించి అవకాశం ఇవ్వడానికి మనం ఉన్నాం కదా! ఖచ్చితంగా ఇండియన్ ఐడియల్ సీజన్ 4 లో అతను పాడతాడు.ఆ వేదికపై అతడితో కలిసి నేను కూడా ప్రదర్శన ఇస్తానని తెలిపాడు.
కొన్ని రోజుల క్రితం తెలంగాణ ఆర్టీసి ఎండి సజ్జనార్(sajjanar)కూడా ఆ యువకుడు పాడిన పాట వీడియోని ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి షేర్ చేస్తూ మనం చూడాలే కానీ ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో. ఈ యువకుడు అద్భుతంగా పాడాడు కదా ఒక అవకాశం ఇచ్చి చూడండి కీరవాణి సర్ అని కోరారు.