English | Telugu

Thalavan review: తలవన్ రివ్యూ

 

మూవీ : తలవన్
నటీనటులు: బిజు మీనన్, అసిఫ్ అలీ, మియా జార్జ్, సుజిత్ శంకర్, దిలీష్ పోతన్
సినిమాటోగ్రఫీ: శరణ్ వేలాయుదన్
ఎడిటింగ్: సూరజ్ ఈఎస్
మ్యూజిక్: దీపక్ దేవ్
దర్శకత్వం: జిస్ జోయ్
ఓటీటీ: సోనిలివ్

కథ: 

సీఐగా జయశంకర్(అసిఫ్ అలీ) పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ కి ట్రాన్సఫర్ మీద ఎస్ ఐ కార్తీక్ వాసుదేవన్(బిజు మీనన్) వస్తాడు. ఒకరోజు తన స్నేహితుడిని కార్తీక్ విడుదల చేయడంతో జయ శంకర్, కార్తీక్ ల మధ్య గొడవ జరుగుతుంది. ఇక ఆ సమయంలోనే జయశంకర్ ఇంటి మేడ మీద రమ్య అనే యువతి డెడ్ బాడీ దొరుకుతుంది. రమ్యతో అతనికి రిలేషన్ ఉందనే కారణంతో   జయశంకర్ ని పోలీసులు అరెస్టు చేస్తారు. అసలు రమ్యని హత్య చేసిందెవరు? ఈ మర్డర్ ని కార్తీక్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి కారణమేంటి? జయశంకర్ ని కార్తీక్ కాపాడాడా లేదా అనేది మిగతా కథ.

విశ్లేషణ:

థ్రిల్లర్ లవర్స్ కి ఈ సినిమా నచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి. అయితే భారీ అంచనాలతో చూడకపోవడమే బెటర్. ఎందుకంటే ఫస్టాఫ్ ఉన్నంత గ్రిస్పింగ్ స్క్రీన్ ప్లే సెకెంఢాఫ్ ఉండదు. ఇన్వెస్టిగేషన్ ని చివరి వరకు సాగదీయడం కాస్త మైనస్ అయ్యింది లేకుంటే ఇది హిట్ కథే.

ఫస్టావ్ వరకు కథ ట్విస్ట్ లతో ఫుల్ ఎంగేజింగ్ గా సాగుతుంది. ఇక సెకెంఢాఫ్ లోనైన అవి రివీల్ చేస్తూ వెళ్తారని ప్రేక్షకుడి భావిస్తాడు కానీ ఎప్పుడో క్లైమాక్స్ లో అన్నీ రివీల్ చేసి ఇంకా సెకెండ్ పార్ట్ ఉందంటు ముగిస్తారు. ఇది కాస్త లోటుగా మిగిలింది. కథా వస్తువు బలంగా ఉన్నప్పటికి ప్రెజెంటేషన్ లో దర్శకుడు కాస్త తడబడ్డాడు. ముఖ్యంగా స్లో పేస్ లో సాగే సీన్లు, ఇన్వెస్టిగేషన్ పేరుతో ల్యాగ్ ఎక్కువ చేసాడనిపిస్తుంది.

థ్రిల్లర్ ప్రేక్షకులు ఒక్కసారి మాత్రమే చూస్తే చాలు అన్నట్టుగా ఉంటుంది. ఇక కామన్ ఆడియన్స్ కి నచ్చే అవకాశాలు తక్కువే. కథేంటో తెలుసుకోవడం కోసం ఓసారి చూడొచ్చు. అడల్ట్ సీన్లు ఏమీ లేవు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎడిటింగ్ లో కాస్త జాగ్రత్త వహించాల్సింది. సినిమాటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

బిజు మీనన్, అసిఫ్ అలీ నటన సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. ఇక మిగిలిన వారు వారి పాత్రల పరిధి మేర నటించారు. 

ఫైనల్ గా : థ్రిల్ ని పంచే ఇన్వెస్టిగేషన్.. వన్ టైమ్ వాచెబుల్

✍️. దాసరి మల్లేశ్