English | Telugu

తెలుగువన్ షార్ట్ ఫిల్మ్ విన్నర్ 'I Want a Virgin'

తెలుగువన్‌... అనేకమంది యువతీయువకులకు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ పేరుతో ఓ అద్భుతమైన వేదికను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా షార్ట్ ఫిలిం దర్శకులను ప్రోత్సహించడంలో భాగంగా నెలనెలా ఉత్తమ షార్ట్ ఫిలిం దర్శకుడికి పదివేల రూపాయల నగదు బహుమతి అందిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. 16 మే నుంచి 15 జూన్ వరకు తెలుగువన్ ప్రోత్సాహంతో రూపొందించిన షార్ట్ ఫిలిమ్స్ లో 'I Want a Virgin' షార్ట్ ఫిల్మ్ ఉత్తమ షార్ట్ ఫిల్మ్౦గా ఎంపికయింది. తెలుగువన్ అందించిన షార్ట్ ఫిలిం అవకాశం మెట్టు ఎక్కిన చాలామంది తమ ప్రతిభతో మరిన్ని మెట్లు ఎక్కి సినిమా రంగానికి చేరువయ్యారు కూడా.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.