English | Telugu
సిక్స్ ప్యాక్ తో ప్రిన్స్ మహేష్ బాబు
Updated : Jun 16, 2011
సిక్స్ ప్యాక్ తో ప్రిన్స్ మహేష్ బాబు తన రానున్న "ది బిజినెస్ మ్యాన్ " సినిమాలో కనిపించనున్నారు. వివరాల్లోకి వెళితే టాలీవుడ్ లో ప్రిన్స్ అని అభిమానులు పిలుచుకునే మహేష్ బాబు ఇప్పటి వరకూ ఒక చాక్లెట్ బోయ్ లా, ఒక లవర్ బోయ్ లా కనపడుతూండేవాడు. అలాంటి మహేష్ బాబుని "ఒక్కడు" సినిమాతో యాక్షన్ హీరోని చేశాడు గుణశేఖర్. అలా యాక్షన్ హీరోగా మారిన మహేష్ బాబుని "పోకిరి" సినిమాతో పక్కా మాస్ హీరోని చేశాడు పూరీ జగన్నాథ్.
అలా మాస్ హీరో అయిన మహేష్ బాబుని సిక్స్ ప్యాక్ క్లబ్ లో జాయిన్ చేయాలని నిర్ణయించుకున్న దర్శకుడు పూరీ జగన్నాథ్ "పోకిరి" తర్వాత మహేష్ బాబు హీరోగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రాబోయే "ది బిజినెస్ మ్యాన్ " సినిమాలో మహేష్ బాబు సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించేలా చేస్తానన్నాడట. అందుకు తగ్గట్టే "దూకుడు" సినిమాలోనే ఆ సిక్స్ ప్యాక్ బాడీ శ్యాంపిల్ చూపిస్తున్నాడు మహేష్ బాబు. ఇక్కడ మేమిచ్చిన రెండు ఫొటోలనూ జాగ్రత్తగా గమనిస్తే మహేష్ బాబు శరీరంలో మార్పు కనిపిస్తుంది. అంటే భవిష్యత్తులో మహేష్ బాబు కూడా చొక్కా విప్పి కనిపించే అవకాశాలున్నాయన్నమాట.