English | Telugu

చిత్రసీమలోను మాకు అన్యాయం జరిగింది


ఏపి ఫిలిం ఛాంబర్ కార్యాలయంలోని ఓ భాగాన్ని తెలంగాణ ఫిలిం ఛాంబర్ కార్యాలయానికి తక్షణం కేటాయించాలని తద్వారా తెలంగాణా సినీ కళాకారులకు, తెలంగాణా సినిమాలకు ప్రోత్సాహించాలని, తెలంగాణ నిర్మాతల మండలి అధ్యక్షుడు సానా యాదిరెడ్డి అన్నారు.

గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ అంశం గురించి ఆయన స్పష్టమైన అభిప్రాయాలను వెలిబుచ్చారు. తెలంగాణకు సినీరంగంలో కూడా అన్యాయం జరుగుతూ వస్తోందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. తెలంగాణ సినిమాను ప్రాంతీయ భాషా చిత్రంగా చూపించడంలో గల ఆంతర్యమేమిటో తెలియాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ దశలో తెలంగాణా సినిమా అభివృద్ది కోసం రాయితీలు, సబ్సిడీలు ఇవ్వాలని కోరారు. ప్రాంతీయ చిత్రాలుగా కాకుండా తెలంగాణ చిత్రాలను గుర్తించి, గౌరవించాలని తెలంగాణ దర్శకుల సంఘం అధ్యక్షుడు అల్లాణి శ్రీధర్ అన్నారు. రాష్ట్రాల విభజన తర్వాత సినీ పరిశ్రమ కలిసి ఉండటం కుదరదని ఈ సభలో పాల్గొన్న సంగిశెట్టి దశరథ అన్నారు.


ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.