English | Telugu
శ్రీరెడ్డి వెలివేత..సెక్షన్ 196 ,353 ప్రకారం కేసు
Updated : Nov 13, 2024
ప్రముఖ సినీనటి,యూట్యూబర్ శ్రీరెడ్డి(sri reddy)గత వైసిపీ ప్రభుత్వంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(chandrababu naidu)ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(pawan kalyan)ఐటి శాఖ మంత్రి లోకేష్(lokesh)హోం మినిస్టర్ అనిత(anitha)లతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులని కూడా ఎవరు వినటానికి కూడా ఇష్టపడని విధంగా అత్యంత జుగుప్సాకరమైన రీతిలో నానా దుర్భాషలాడింది.
ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన రాజమండ్రి లోని బొమ్మూరు పోలీసుస్టేషన్ లో శ్రీరెడ్డి మీద చర్యలు తీసుకోవాలంటూ ఒక మహిళ ఫిర్యాదు చేసింది.ఫిర్యాదు ని స్వీకరించిన పోలీసులు శ్రీరెడ్డి పై సెక్షన్ 196 , 353 లే కాకుండా ఇంకో నాలుగు కేసుల్ని కూడా నమోదు చేసారు.దీంతో శ్రీ రెడ్డి అరెస్ట్ ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి.
కొన్ని రోజుల క్రితం శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు, పవన్, లోకేష్, అనిత లకి క్షమాపణ చెప్పింది. ఈ విషయంపై కూడా శ్రీ రెడ్డి మీద కేసు పెట్టిన మహిళ మాట్లాడుతు శ్రీరెడ్డి ని ఎందుకు క్షమించాలి. వైసిపీ అధికారంలో ఉంది కదా అని మహిళలందరూ తల దించుకునేలా మాట్లాడింది. రాష్ట్రంలోని ఆడవాళ్ళ అందరం ఆమెని వెలివేసాం. తక్షణమే ఆమెని అరెస్ట్ కూడా చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాం అని చెప్పుకొచ్చింది.