English | Telugu

సల్మాన్ కి స్నేహ బిస్కెట్!

సంతోషంలో ఉన్నప్పుడు ఎందరైనా పక్కనుంటారు....కానీ బాధలో ఉన్నప్పుడు మనతో ఉండేవాళ్లే నిజమైన స్నేహితులంటారు. ఇప్పుడలాంటి క్రెడిట్ దక్కించుకునే పనిలో పడింది స్నేహా ఉల్లాల్. మాజీ ప్రియురాలు ఐశ్వర్యారాయ్ పోలికలు ఉండడంతో పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు సల్మాన్. బడా హీరోతో ఎంట్రీ ఇచ్చినా అమ్మడులో మేటర్ లేకపోవడంతో ఆ తర్వాత పెద్దగా క్లిక్కవలేదు. తెలుగులో రెండు మూడు సినిమాల్లో నటించినా ఒరిగిందేమీ లేదు. దీంతో మళ్లీ బాలీవుడ్ లోనే నిలదొక్కుకునేందుకు ట్రై చేస్తోందట. అందుకే ముందుగా సల్మాన్ ఫ్యాన్స్ ను బుట్టలో వేసుకునే ప్రయత్నం చేసింది. జైలు శిక్ష పడిన భాయ్ కు సపోర్ట్ గా అంతా ముందుకు రావాలని ట్వీట్ చేసింది. ఈలోగా బెయిల్ రావడంతో సైలెంటైపోయింది. అయితే అమ్మడి ప్రేమంతా సల్మన్ పై కాదు ఆఫర్ల కోసం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి మాజీ ప్రియురాలి పోలికలున్న స్నేహాకు మరోసారి భాయ్ స్నేహహస్తం చాటుతాడేమో వెయిట్ అండ్ సీ.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.