English | Telugu

డేటింగ్ కి వస్తే డబ్బులు నేనే కడతాను

కమల్ హాసన్(kamal haasan)నట వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసిన భామ శృతి హాసన్(shruti haasan)ఆ తర్వాత నటనకు ప్రాధాన్యమున్న ఎన్నో చిత్రాల్లో నటించి తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకుంది. శృతి ఒక సినిమాలో ఉందంటే ఇంక ఆ సినిమా హిట్ అనేంత పేరు కూడా సంపాదించింది. గబ్బర్ సింగ్, ఎవడు, బలుపు,రేసుగుర్రం,శ్రీమంతుడు,ప్రేమమ్, క్రాక్,వాల్తేరు వీరయ్య, వీర సింహ రెడ్డి, సలార్ లాంటి హిట్ చిత్రాలే అందుకు ఉదాహరణ.
  
రీసెంట్ గా టిండర్ స్వైప్ రైడ్ లో భాగంగా కుశా కపిలతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి  డేటింగ్ పై మాట్లాడుతు డేటింగ్ కి  వెళ్లినప్పుడు అమ్మాయిలకు అబ్బాయిలు ఖర్చు పెట్టడం కామన్. కానీ నా విషయంలో మాత్రం రివర్స్. కొందరు నా దగ్గర డబ్బు బాగా ఉందంటూ నాతోనే  ఖర్చు పెట్టించారు. నా దగ్గర డబ్బు బాగా ఉంది కదా అన్నది వాళ్ల ఫీలింగ్.  మొదట్లో ఎదుటి వ్యక్తి బిల్లు గురించి ఆలోచించక ముందే కట్టే దాన్ని. నా దృష్టిలో అలా కట్టడం కూడా ప్రేమని వ్యక్త పరచడమే. కానీ ఎదుటి వాళ్ళు  అలా అనుకోవడం లేదు. అందుకే ఇప్పుడు డబ్బులు విషయంలో చాలా క్లియర్ గా ఉంటున్నాను.మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం చాలా ముఖ్యమని నేను భావిస్తాను. కానీ దాని వల్ల ఇబ్బందులూ కూడా ఉన్నాయి.నేను చాలా కాలంగా ఆర్థికంగా ఎవరిపైనా ఆధారపడకుండా ఉన్నానని చెప్పుకొచ్చింది

నా కాబోయే పార్ట్‌నర్ ఎప్పుడు కూడా నన్ను నవ్విస్తూ ఉండాలని, అలాంటి వ్యకి కోసం ఎదురుచూస్తున్నాని కూడా చెప్పింది. శృతి గతంలో ఇద్దరితో రిలేషన్ లో ఉండి ఆ తర్వాత విడిపోయింది. ప్రస్తుతం అడవి శేష్ తో డెకాయిట్ అనే మూవీ తో పాటు రజనికాంత్ కూలీ లో చేస్తుంది.