English | Telugu
గేమ్ చేంజర్,ఇండియన్ 3 బెస్ట్ సినిమాలు
Updated : Dec 19, 2024
స్టార్ హీరోలకి ధీటుగా పేరు సంపాదించిన అతి కొద్దీ మంది దర్శకుల్లో శంకర్ కూడా ఒకరు.'జెంటిల్ మెన్' మూవీతో మొదలైన ఆయన సినీ ప్రస్థానంలో ఎక్కువ శాతం విజయాలే ఉన్నాయి.నెక్స్ట్ ఇయర్ జనవరి 10 న సంక్రాంతి కానుకగా రామ్ చరణ్ వన్ మాన్ షో 'గేమ్ చేంజర్'తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.శంకర్ గత చిత్రం ఇండియన్ 2 ఎన్నో అంచనాలతో విడుదలై పరాజయం చెందటంతో ఇప్పుడు అందరిలోను 'గేమ్ చేంజర్' పై ఆసక్తి నెలకొని ఉంది.
గేమ్ చేంజర్ కి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్న శంకర్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది.అందులో ఆయన మాట్లాడుతు నా గత చిత్రం ఇండియన్ 2 కి నెగిటివ్ రివ్యూస్ రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది.అసలు ఆ విధంగా వస్తాయని ఊహించలేదు. ఇప్పుడు రానున్న గేమ్ చేంజర్,ఇండియన్ 3 చిత్రాల ద్వారా ఉత్తమమైన వర్క్ ని ప్రేక్షకులకి అందిస్తున్నాను.ప్రేక్షకులు తప్పకుండా ఎంటర్ టైన్ అవుతారు.పొలిటికల్ యాక్షన్ ఫిలింగా గేమ్ చేంజర్ తెరకెక్కింది.ఒక ప్రభుత్వ అధికారికి,రాజకీయ నాయకుడికి మధ్య జరిగే యుద్ధమే గేమ్ చేంజర్.
సినిమా విషయంలో పూర్తి సంతృప్తిగా ఉన్నాను.మూవీలోని క్యారక్టర్ రామ్ చరణ్ కెరిరీలో నే ఎప్పుడు గుర్తుండిపోతుంది.లుక్,యాక్షన్,డైలాగ్స్,డాన్స్ ఇలా అన్ని విషయాల్లో రామ్ చరణ్ సూపర్ గా చేసాడు.ఇదొక పూర్తి స్థాయి మాస్ కమర్షియల్ కంటెంట్ అని చెప్పుకొచ్చాడు.ఇప్పుడు ఈ మాటలు మెగా ఫ్యాన్స్ లో జోష్ ని తీసుకొస్తున్నాయి.తమన్ సంగీత సారధ్యంలో తెరకెక్కిన గేమ్ చేంజర్ ని దిల్ రాజు నిర్మించగా చరణ్ సరసన కియారా అద్వానీ జత కట్టింది.అంజలి,ఎస్ జె సూర్య,శ్రీకాంత్ ముఖ్య పాత్రల్లో కనిపిస్తుండగా ఈ నెల 21 న యుఎస్ లోని టెక్సాస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.