English | Telugu

"శకుని" ఆడియో రిలీజ్

"శకుని" చిత్రాన్ని, కార్తీ, ప్రణీత జంటగా నటించగా, తమిళంలో స్టుడియో గ్రీన్ పతాకంపై, జ్ఞానవేల్ నిర్మిస్తూండగా, తెలుగులో శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ విడుదల చేస్తున్నారు. ఈ "శకుని" చిత్రానికి ఎ.ఆర్. రెహమాన్ మేనల్లుడు జి.వి.ప్రకాష్ సంగీతం అందించారు. జూన్ 8 వ తేదీన, హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఉదయం 7.30 గంటలకు ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్, ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ ల చేతుల మీదుగా ఈ చిత్రం ఆడియో రిలీజయ్యింది.

ఈ ఆడియో విడుదల కార్యక్రమానికి ప్రముఖ నటులు కోట శ్రీనివాసరావుతో పాటు, ఈ చిత్ర హీరో, హీరోయిన్లు, పాటల రచయిత సాహితి, తమిళ, తెలుగు వెరషన్ల నిర్మాతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆహూతులందరూ ఈ చిత్రం ఆడియో అలాగే ఈ "శకుని" చిత్రం కూడా ఘనవిజయం సాధించాలని ఆశించారు. హీరో కార్టీ ప్రసంగిస్తూ ఇది ఒక పూర్తి వినోదాత్మక చిత్రమని అన్నారు. నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ ఈ "శకుని" చిత్రాన్ని 450 థియేటర్లలో జూన్ 22 వ తేదీన విడుదల చేయనున్నామని తెలియజేశారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.