English | Telugu
నేను పడ్డ కష్టాలు గుర్తుకొస్తాయనే ఆ ఇద్దరి జోలికి వెళ్లడం లేదు
Updated : Nov 26, 2024
స్టార్ హీరోయిన్ సమంత(samantha)లేటెస్ట్ గా వరుణ్ ధావన్(varun davan)హీరోగా రాజ్ అండ్ డికె(raj&dk)దర్శకద్వయంలో తెరకెక్కిన 'సిటాడెల్ హానీ బన్నీ'(citadel honey bunny)అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా నవంబర్ ఆరునుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ మంచి ప్రేక్షకాదరణని పొందుతుంది. సమంత, వరుణ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ అయితే ఒక రేంజ్ లోనే మెస్మరైజ్ చేస్తున్నాయి.
రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న సమంత సిటాడెల్ గురించి మాట్లాడుతూ ఇప్పటి వరకు సిటాడెల్ ని నేను పూర్తిగా చూడలేదు.ఎందుకంటే నేను అనారోగ్యంతోనే ఆ సిరీస్ లో పాల్గొన్నాను.సెట్ లో ఎన్నో కష్టతరమైన రోజులు నాకు ఎదురుకావడంతో పాటు శారీరకంగా మానసికంగా ఎన్నో సవాళ్ళని కూడా ఎదుర్కొన్నాను. కాబట్టి ఈ సిరీస్ చూస్తే నేను ఆ జ్ఞాపకాల్లోకి వెళ్లి ఆ అనుభవాలన్నింటిని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాలనిపిస్తుంది.అది నాకు చాలా బాధాకరంగా కష్టంగా ఉంటుంది.అందుకే కేవలం మొదటి ఎపిసోడ్ మాత్రమే చూసాను.రెండో ఎపిసోడ్ మాత్రం చూడలేకపోయానని చెప్పుకొచ్చింది.ప్రస్తుతం ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచాయి.
సమంత ప్రస్తుతం' మా ఇంటి బంగారం' అనే మూవీ చేస్తుంది.అంతే కాకుండా ఈ సినిమాకి ఆమెనే నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. రక్త్ బ్రహ్మాండ అనే హిందీ వెబ్ సిరీస్ కూడా ఆమె ఖాతాలో ఉంది.