English | Telugu
గణపతిదేవ చక్రవర్తి ఫస్ట్ లుక్
Updated : Jul 17, 2015
రుద్రమదేవి సినిమాపై హైప్ పెంచడానికి గుణశేఖర్ 'బాహుబలి' బాటను ఎంచుకున్నాడు. రాజమౌళి 'బాహుబలి'లో నటించిన ఒక్కో పాత్రనూ పరిచయం చేస్తూ, ఆయా పాత్రల తాలూకు లుక్స్‌ని విడుదల చేసి 'బాహుబలి'కి సంబంధించిన ఏదో ఒక న్యూస్ జనాలలో వుండేలా చూసుకున్నాడు. ఇప్పుడు ఇదే మంత్రాన్ని గుణశేఖర్ కూడా అమలు చేస్తున్నారు.
రుద్రమదేవి' చిత్రంలో నటించిన ఒక్కో పాత్రల తాలూకు లుక్స్‌ని చిత్ర యూనిట్ బయటకు విడుదల చేస్తోంది. నిన్న'శివదేవయ్య' పాత్రలో నటిస్తున్న ప్రకాష్‌రాజ్ గెటప్‌ని విడుదల చేయగా.. ఈ రోజు కృష్ణంరాజు పాత్ర లుక్ బయటకు వచ్చింది. రాజసం ఉట్టిపడే పాత్రలో కృష్నంరాజు గణపతిదేవ చక్రవర్తి పాత్రలో ఒదిగిపోయారట.ఈ సినిమాలో ఆయన పాత్రకు చాలా ప్రాధాన్యత వుంటుందట. గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుష్క టైటిల్ రోల్‌లో కనిపించనుంది.