English | Telugu

రతన్ టాటా మరణంపై మాజీ ప్రేయసి ట్వీట్

భారతీయ పారిశ్రామిక రంగానికి అంతర్జాతీయ గుర్తింపుని తెచ్చిన వ్యాపార  దిగ్గజం రతన్ టాటా(ratan tata)మరణం ఇప్పుడు ప్రతి భారతీయుడిని ఎంతగానో కలిచి వేస్తుంది. గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ముంబై లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. దీంతో ప్రధానమంత్రి తో మొదలుకొని ఎంతో మంది రాజకీయ, సినీ,వ్యాపార ప్రముఖులు తమ ప్రగాఢ సానుభుహతిని తెలియచేస్తున్నారు.

రీసెంట్ గా రతన్ టాటా మరణంపై ఆయన మాజీ ప్రేమికురాలు,అలనాటి సినీ నటి, డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌ గా వర్క్ చేసినటువంటి  సిమి గరేవాల్‌(simi garewal pens)ఒక ట్వీట్ చేసింది.ఇక నువ్వు లేవని అంటున్నారు.ఇది భరించలేనిది వీడ్కోలు నేస్తమా అని ట్వీట్ చేసింది. 2011 లో హిందుస్థాన్ టైమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో రతన్ టాటా తో డేటింగ్ చేసానని ఆ తర్వాత ఇద్దరం విడిపోయామని స్వయంగా సిమి నే చెప్పింది.