English | Telugu

రామ్ పోతినేని తో పుష్ప 2 నిర్మాతల భారీ ప్రాజెక్టు ఇదే  

తెలుగు ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని వర్సటైల్ యాక్టర్ రామ్ పోతినేని(ram pothineni)క్యారెక్టర్, లుక్స్ పరంగా ఎప్పటికప్పుడు డిఫరెన్స్ చూపించే హీరో. ఇప్పుడు మరో కొత్త లుక్, క్యారెక్టర్‌తో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ (mythri movie makers)నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి, గత సంవత్సరం మిస్టర్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి వంటి విజయవంతమైన చిత్రానికి దర్శకత్వం వహించిన మహేష్ బాబు పి దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ సినిమాకి సంబంధించి  హీరో క్యారెక్టర్ లుక్ ని విడుదల చెయ్యడం జరిగింది 

 'మీకు సుపరిచితుడు, మీలో ఒకడు  మీ సాగర్' అంటూ రామ్ క్యారక్టర్ ని పరిచయం చేశారు.రామ్ క్యారెక్టర్ లుక్ చూస్తే వింటేజ్ ఫీలింగ్ కలుగుతుంది.పాత రోజుల్లో ఉపయోగించే సైకిల్, రామ్ లాంగ్ హెయిర్ అండ్ క్లీన్ షేవ్, అన్నిటికి మించి రామ్ ముఖంలో నవ్వు కనపడుతున్న ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే ఒక ఆహ్లాదకరమైన ఫీలింగ్ కలుగుతోంది. రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందని కూడా మేకర్స్  తెలిపారు. అందులో భాగంగా హైదరాబాద్ సిటీలో షూటింగ్ జరుగుతోంది. రామ్ కెరీర్లో ఇరవై రెండవ చిత్రం కాగా ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. 

రామ్ సరసన మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా అగ్ర శ్రేణి సాంకేతిక నిపుణులు వర్క్ చేస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ ,శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్, సినిమాటోగ్రఫీ: మధు నీలకందన్, మ్యూజిక్: వివేక్ - మెర్విన్, సీఈవో: చెర్రీ, ప్రొడక్షన్ హౌస్: మైత్రి మూవీ మేకర్స్,ప్రొడ్యూసర్స్: నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి.ఇక నవీన్, రవి శంకర్ లు నిన్న విడుదలైన పుష్ప 2(pushpa 2)తో భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ ప్రాజెక్ట్ పై క్రేజ్ ఏర్పడింది.