English | Telugu
గేమ్ చేంజర్ కి సంబంధించి శంకర్ పై చరణ్ కీలక వ్యాఖ్యలు
Updated : Dec 16, 2024
ఇండియన్ చిత్ర పరిశ్రమలోని వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రెస్టేజియస్ట్ మూవీ గేమ్ చేంజర్(game changer)గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram charan)లెజండరీ డైరెక్టర్ శంకర్(shankar) కాంబోలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీపై మెగా అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.దాదాపు మూడు సంవత్సరాల పాటు సెట్స్ మీద ఉన్న గేమ్ చేంజర్ ని దిల్ రాజు తన సినీ కెరీర్లోనే ఫస్ట్ టైం అత్యంత భారీ వ్యయంతో నిర్మించాడు.గతంలో దిల్ రాజు,చరణ్ కాంబోలో 'ఎవడు' అనే మూవీ కూడా సంక్రాంతి కానుకగా జనవరి 12 న వచ్చి సూపర్ డూపర్ హిట్ ని అందుకుంది.దీంతో గేమ్ చేంజర్ కూడా జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
రీసెంట్ గా నాగార్జున(nagarjuna)హోస్ట్ గా వ్యవహరిస్తున్నబిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్ ఎపిసోడ్ కి రామ్ చరణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు.అందులో చరణ్ మాట్లాడుతు ఆర్ఆర్ఆర్ చివరి షెడ్యూల్ జరుగుతున్నప్పుడు శంకర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది.గేమ్ చేంజర్ గురించి ఆయన చెప్పడంతో రాజమౌళి తర్వాత ఎవరితో సినిమా చెయ్యాలనే ఆలోచనలో ఉన్న నేను,చాలా హ్యాపీగా ఫీలయ్యి మరో ఆలోచన లేకుండా వెంటనే ప్రాజక్టుకి ఓకే చెప్పేసాను.వింటేజ్ శంకర్ పొలిటికల్ మూవీస్ లో చూసిన ఎమోషన్స్,ఎలివేషన్స్ అన్నీ గేమ్ చేంజర్ లో ఉంటాయి.ఖచ్చితంగా అభిమానులని, ప్రేక్షకులని నిరాశ పరచదని చరణ్ హామీ ఇవ్వడం జరిగింది.ఇప్పుడు ఈ మాటలు మెగా అభిమానుల్లో ఫుల్ జోష్ ని తీసుకొస్తున్నాయి.
రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ లో వేగం పెరిగింది.ఈ మేరకు డిసెంబర్ 21 న యుఎస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.అవుట్ అఫ్ కంట్రీ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోబోతున్న ఫస్ట్ ఇండియన్ మూవీగా కూడా గేమ్ చేంజర్ రికార్డు సృష్టించిందని చెప్పవచ్చు.ఇక హైదరాబాద్ లో ఈ నెల 28 ట్రైలర్ లాంచ్ జరగబోతుందని దిల్ రాజు(dil raju)అధికారకంగా ప్రకటించాడు.చరణ్ సరసన కియారా అద్వానీ జోడి కట్టగా అంజలి,ఎస్ జె సూర్య, శ్రీకాంత్ లు ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు.తమన్ మ్యూజిక్ లో ఇప్పటికే రిలీజైన మూడు పాటలు రికార్డు వ్యూస్ తో ముందుకు దూసుకుపోతున్నాయి.