English | Telugu

కోయంబత్తూరు పారిపోయిన రామ్ గోపాల్ వర్మ..శ్రీరెడ్డి కూడా అక్కడే ఉందా!

గత ఎన్నికలకి ముందు చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాణ్,లోకేష్ పై రామ్ గోపాల్ వర్మ(ram gopal varma)సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చెయ్యడంతో పాటుగా,ఆ ముగ్గురి ఫోటోలని అసభ్యకర రీతిలో మార్ఫింగ్ చేసి,అప్ లోడ్ కూడా చేసాడు. దీంతో కొన్ని రోజుల క్రితం వర్మ పై ఏపిలోని ప్రకాశం జిల్లాలో పోలీసు కేస్ నమోదయిన విషయం తెలిసిందే. దీంతో గత కొన్ని రోజుల నుంచి  విచారణకి హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇస్తూ వస్తున్నా కూడా వర్మ విచారణకి హాజరు కాకుండా కాలక్షేపం చేస్తు వస్తున్నాడు.

ఇక ఈ రోజు వర్మ  విచారణకి హాజరు కావాల్సి ఉంది. దీంతో పోలీసులు హైదరాబాద్ లోని వర్మ ఇంటికి వెళ్లారు.కానీ వర్మ మాత్రం ఇంట్లో ఉన్నాడని పోలీసులని నమ్మించి, చెన్నై పారిపోయినట్టుగా తెలుస్తుంది.   ప్రస్తుతం కోయంబత్తూర్ లో తల దాచుకున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో  చెన్నై పోలీసులని సమాచారం ఇచ్చిన ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు చెన్నై కి బయలుదేరి వెళ్లారు.కొన్ని రోజులుగా విచారణకి కొన్ని రోజుల సమయం కావాలని కోరుతూ వస్తున్న వర్మ ఇప్పుడు పారిపోవడం అనేది ఒక పెద్ద నేరం కింద పోలీసులు భావిస్తున్నారు. దీంతో వర్మ దొరికితే మాత్రం ఇక జైలు నుంచి ఇప్పట్లో బయటకి రావడం అసాధ్యం అనే మాటలు వినిపిస్తున్నాయి. శ్రీరెడ్డి దగ్గరకి వెళ్లాడనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు.