English | Telugu
ఆ హీరోలు మాత్రమే సెలబ్రటీస్ కాదు..జితేందర్ రెడ్డి తో పాటు కలిసి నడవండి
Updated : Nov 6, 2024
రాకేష్ వర్రే(rakesh varre)హీరోగా తెరకెక్కిన చిత్రం జితేందర్ రెడ్డి(jithender reddy)కరీంనగర్ జిల్లా జగిత్యాల కి చెందిన రాజకీయనాయకుడు దివంగత జితేందర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 8 న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయులతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
ఈ సందర్భగా హీరో రాకేష్ మాట్లాడుతు సాలిడ్ కంటెంట్ ఉన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలనే ఉద్దేశంతో చాలా సంవత్సరాల తర్వాత జితేందర్ రెడ్డి మూవీతో వస్తున్నాను.ప్రొడ్యూసర్ గా కూడా నేనే చేస్తున్నాను.బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన నాకు ఇండస్ట్రీ లో సెటిల్ కావడానికి చాలా టైం పట్టింది. మా సినిమాకి సెలబ్రిటీ ని తీసుకొస్తే బాగుంటుందని కొంత మంది నాతో చెప్పారు. కానీ సెలబ్రటీ ని తీసుకురావడానికి చాలా కష్టపడాలి.అయినా వాళ్ళు నా లాంటి వాడి కోసం ఎందుకు వస్తారు. సెలబ్రటీస్ ఆబ్లిగేషన్ పై వస్తారు.లేదంటే ఫ్రెండ్ షిప్ కోసం వస్తారు.చాలా మంది ఒక సెలబ్రటీ ఉంటేనే ఈవెంట్ అవుతుందని అనుకుంటున్నారు.ఈ మైండ్ సెట్ నాతో సహా మారాలి. సెలబ్రటీ ని తీసుకొచ్చేలోపు ఒక సినిమా చేయచ్చు.చాలా మందికి నా సినిమాకి వచ్చి సపోర్ట్ చెయ్యమని మెసేజ్ చేశాను.నేను సిన్సియర్ గా మెసేజ్ చెయ్యడం వలన వాళ్ళు రాలేదేమో.
సినిమాని జనాల్లోకి తీసుకువెళ్లేది డిస్ట్రిబ్యూటర్స్ అని ఈ మూవీ ద్వారా అందరకి తెలియాలి. మా జితేందర్ రెడ్డి మూవీ లాస్ట్ ఇయర్ మే లోనే విడుదల కావాల్సి ఉంది..కానీ ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. ఏవో గొడవలు జరుగుతాయని కనీసం సెన్సార్ కూడా ఇవ్వలేదు. ఢిల్లీ లెవల్లో కూడా ఆపారు. మూవీలో మేము తప్పుగా ఏం చెప్పలేదు. జితేందర్ రెడ్డి ఐడియాలజీ ని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్లే ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తారని చెప్పుకొచ్చాడు. ఉయ్యాలా జంపాల ఫేమ్ విరించి వర్మ(virinchi varma)దర్శకత్వం వహించిన ఈ మూవీలో రియా సుమన్, వైశాలి, సుబ్బరాజు, రవి ప్రకాష్ ప్రధాన పాత్రలో నటించారు.